బిజినెస్

ఆర్థిక, త్రైమాసిక ఫలితాలు దిక్సూచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం స్థూల ఆర్థిక గణాంకాలు, త్రైమాసిక ఆర్థిక ఫలితాల ఆధారంగా ట్రేడ్ అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, విదేశీ విపణిలో ముడి చమురు ధరలు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, విదేశీ మదుపరుల పెట్టుబడులు కూడా సూచీలను ప్రభావితం చేస్తాయని అంటున్నారు. ‘అంతర్జాతీయ మార్కెట్ల తీరు, స్థూల ఆర్థిక గణాంకాలు, వర్షాలు ఈ వారం భారతీయ స్టాక్ మార్కెట్ల పోకడను నిర్దేశిస్తాయి.’ అని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా అన్నారు. అంతేగాక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కొత్త గవర్నర్ కూడా మార్కెట్లను శాసించగలరని పేర్కొంటున్నారు. ఇకపోతే ఈ వారం ప్రభుత్వరంగ చమురు, సహజవాయువు అనే్వషణ దిగ్గజం ఒఎన్‌జిసి, గ్యాస్ సరఫరా సంస్థ గెయిల్‌తోపాటు ప్రభుత్వరంగ బొగ్గు ఉత్పాదక దిగ్గజం కోల్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్) గాను ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. వీటితోపాటు మరో రెండు అగ్రశ్రేణి ప్రభుత్వరంగ సంస్థలైన బిహెచ్‌ఇఎల్, సెయిల్ కూడా ఆర్థిక ఫలితాలను ఈ వారమే వెల్లడించనున్నాయి. దీంతో ఈ ఫలితాల ఆధారంగా మదుపరులు తమ పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకోవచ్చని క్యాపిటల్‌వయా గ్లోబల్ రిసెర్చ్ లిమిటెడ్ వ్యవస్థాపక సిఇఒ రోహిత్ గదియా అభిప్రాయపడ్డారు. సోమవారం ఆగస్టు నెలకుగాను సేవారంగ గణాంకాలు విడుదలవుతాయి. గత వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 749.86 పాయింట్లు ఎగబాకితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 237.10 పాయింట్లు ఎగిసింది.
నేడు మార్కెట్లకు సెలవు
వినాయక చవితి సందర్భంగా సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు. తిరిగి మంగళవారం యథాతథంగా ట్రేడింగ్ కొనసాగుతుందని బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ వర్గాలు ప్రకటించాయి. బులియన్, ఫారెక్స్, కమాడిటీ మార్కెట్లూ గణేశ్ చతుర్థిని పురస్కరించుకుని మూతబడతాయని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
రేపు ఎన్‌ఎస్‌ఇలో బాండ్ల వేలం
నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ మంగళవారం విదేశీ మదుపరులకు 7,046 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ బాండ్లను వేలం వేయనుంది. నిజానికి సోమవారమే వేలం జరగాల్సి ఉన్నప్పటికీ, వినాయక చవితి సందర్భంగా మార్కెట్లకు సెలవు. దీంతో మంగళవారం నిర్వహిస్తున్నారు. సాధారణ ట్రేడింగ్ అనంతరం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండు గంటలపాటు వేలం నిర్వహిస్తారు. ప్రభుత్వ రుణ బాండ్లలో విదేశీ పెట్టుబడులకున్న పరిమితిలో గురువారం నాటికి 95.11 శాతం పెట్టుబడులను విదేశీ మదుపరులు పెట్టారు. పెట్టుబడుల పరిమితి 1.44 లక్షల కోట్ల రూపాయలవగా, 1,36,954 కోట్ల రూపాయల పెట్టుబడులున్నాయి.