బిజినెస్

పని తీరు ఆధారంగానే తదుపరి నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: ప్రభుత్వం నుంచి రెండో విడత మూలధనం నిధుల కోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆ నిధులను పొందాలంటే రుణాల రికవరీ సహా కొన్ని నిబంధనలను నెరవేర్చాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ వాఖ రీక్యాపిటలైజైషన్ నిబంధనలను సవరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇచ్చే రెండో విడత మూలధనం నిధులు రుణాల రికవరీ, రుణాల నాణ్యతతో పాటుగా నిర్వహణ ఖర్చుల ఆధారంగా ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్) ఫలితాల అనంతరం ఈ కొలమానాలను నెరవేర్చిన బ్యాంకులు మాత్రమే తదుపరి విడత నిధులు పొందడానికి అర్హులవుతాయని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. 13 బ్యాంకుల కోసం తొలి విడత మూలధనం పెట్టుబడుల కోసం ప్రభుత్వం గత జూలైలో రూ. 22,915 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో దాదాపు 75 శాతం నిధులను ఇప్పటికే విడుదల చేయడం జరిగిందని, అయితే మిగతా మొత్తం విడుదల అనేది ఆయా బ్యాంకుల పనితీరు ఆధారంగా ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.