బిజినెస్

త్వరలో మార్కెట్లోకి 3 ఐపిఓలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: దేశీయ మార్కెట్లు జోరుమీదున్న నేపథ్యంలో సెప్టెంబర్‌లో ఏకంగా మూడు కంపెనీలు సుమారు 7 వేల కోట్ల రూపాయలు సేకరించడం కోసం ఐపిఓలతో మార్కెట్లోకి రానున్నాయి. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఎల్‌అండ్‌టి టెక్నాలజీ సర్వీసెస్, జిఎన్‌ఏ యాక్సిల్స్ సంస్థలు ఈ ప్రాథమిక పబ్లిక్ ఇష్యూలతో రానున్నాయి. ఎల్‌అండ్‌టి టెక్నాలజీ సర్వీసెస్ షేర్ల కోసం బిడ్డింగ్ ప్రక్రియ సోమవారం ప్రారంభం కానుండగా, జిఎన్‌ఏ యాక్సిల్స్ షేర్లకు దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 14న ప్రారంభమవుతుంది. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్‌ఇన్సూరెన్స్ పబ్లిక్ ఇష్యూ 19న మొదలవుతుంది. ఐసిఐసిఐ ఐపిఓ ద్వారా రూ 6,057 కోట్లు సమీకరించనుండగా, ఎల్‌అండ్‌టి టెక్నాలజీ రూ 894 కోట్లు, జిఎన్‌ఏ యాక్సిల్స్ రూ. 130 కోట్లు సమీకరించనున్నాయి. ఐపిఓల ద్వారా జారీ అయ్యే ఈ కంపెనీల షేర్లు బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇ రెండింటలోను లిస్టింగ్ అవుతాయి.
ఈ ఏడాది ప్రారంభంనుంచి ఇప్పటివరకు మొత్తం 17 కంపెనీలు ఐపిఓలతో మార్కెట్లోకి రాగా ఈ కంపెనీల షేర్లు మార్కెట్లలో లిస్టింగ్ అయ్యాయి కూడా.ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఐపిఓ ద్వారా 18,13, 41,058 ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. దేశంలో ఒక బీమా కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వెళ్లడం ఇదే మొదటిసారి. అంతేకాదు కోల్ ఇండియా తర్వాత ఇదే అతి పెద్ద ఐపిఓ కావడం గమనార్హం. కంపెనీ తన షేరు ధర రూ 300- 334ల మధ్య ఉంటుందని పేర్కొంది. ఎల్‌అండ్‌టి టెక్నాలజీ సర్వీసెస్ 1,04,00,000 షేర్లను విక్రయించనుండగా, దీని షేరు ధర 850-860 రూపాయల మధ్య ఉంటుందని కంపెనీ తెలిపింది. కాగా, 63 లక్షల షేర్లను జారీ చేయనున్న జిఎన్‌ఏ యాక్సిల్స షేరు ధర 205-207 రూపాయల మధ్య ఉంటుంది.