బిజినెస్

రిజర్వు బ్యాంకు కఠిన నిబంధనలతో రిటైల్ రంగం వైపు మొగ్గక తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 11: కార్పొరేట్ సంస్థలకు రుణాల విషయంలో రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) విధించిన కఠిన నిబంధనల వల్ల బ్యాంకులు కన్స్యూమర్ రుణాల వైపు మొగ్గే అవకాశముందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ) చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య అభిప్రాయ పడ్డారు. రిటైల్ రంగంలో ఎలాంటి సంక్షోభం లేదని కూడా ఆమె అన్నారు. భారీ కార్పొరేట్ సంస్థలకు ఇచ్చే రుణాలకోసం రిజర్వ్ బ్యాంక్ గత నెల కొత్త ముసాయిదా గైడ్‌లైన్సను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ రంగానికి ఇచ్చే రుణాలు గనుక నిర్దేశించిన పరిమితికి మించినట్లయితే అదనపు నిదులను కేటాయించాల్సి ఉంటుందని కూడా బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది కూడా. భారీ కార్పొరేట్ సంస్థలకు ఇచ్చే రుణాలకోసం తాజాగా విడుదల చేసన గైడ్‌లైన్స్ కారణంగా ఈ రంగానికి ఇచ్చే రుణాలు అటు బ్యాంకులకు, ఇటు రుణాలు తీసుకునే కంపెనీలకు కూడా మరింత భారంగా మారనున్నాయని అరుంధతీ భట్టాచార్య పిటిఐకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అందువల్ల రిజర్వ్ బ్యాంకే స్వయంగా మమ్మల్ని రిటైల్ రంగంవైపు మరింత మొగ్గేలా చేస్తోందని ఆమె అన్నారు. అయితే ఎస్‌బిఐపై ఎలాంటి ఒత్తిడి ఉండదని ఆమె అంటూ, మొత్తం వ్యవస్థ గురించి ఆర్‌బిఐకి బాగా తెలుసునని కూడా చెప్పారు. ప్రస్తుతం బ్యాంకులు కార్పొరేట్ రంగానికి తమ మూలధనంలో 55 శాతం దాకా రుణాలు ఇస్తున్నాయి. అయితే ఇకపై ఈ రంగానికి ఇచ్చే రుణాలు 25 శాతానికి మించకూడదని ఆర్‌బిఐ తన తాజా గైడ్‌లైన్సలో సూచించింది. బ్యాంకుల్లో మొండి బకాయిలు (ఎన్‌పిఏలు) విపరీతంగా పెరిగి పోతూ ఉండడం, వాటిలో కార్పొరేట్ సంస్థలు తీసుకునే రుణాలే ఎక్కువగా ఉండడంతో ఆర్‌బిఐ ఈ కొత్త నిబంధనను విధించింది.