బిజినెస్

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 11: ఉత్పత్తి, నిర్వహణ విభాగాల్లో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్న విశాఖ ఉక్కు కర్మాగారానికి సిఐఓ-100 పురస్కారం లభించింది. అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మకమైన ఇంటర్నేషనల్ డేటా గ్రూప్ (ఐడిజి) సంస్థ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా 100 సంస్థలను పరిశీలించిన ఐడిజి విశాఖ స్టీల్‌ప్లాంట్ ఇన్ఫరేషన్ టెక్నాలజీ (ఐటి)ని వినియోగిస్తున్న తీరును ప్రశంసించింది. పూణేలో జరిగిన సంస్థ 12వ వార్షికోత్సవం సందర్భంగా సిఐఓ-100 పురస్కారాన్ని విశాఖ స్టీల్‌ప్లాంట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కెవిఎస్‌ఎస్ రాజేశ్వరరావు, జనరల్ మేనేజర్ అందుకున్నారు. ఈ సందర్భంగా స్టీల్‌ప్లాంట్ సిఎండి పి.మధుసూదన్ మాట్లాడుతూ సంస్థకు సిఐఓ పురస్కారం రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సంస్థ లక్ష్యాలు, పనితీరుకు ఈ ఘనత అద్దం పడుతుందన్నారు.

సిఐఓ-100 పురస్కారాన్ని అందుకుంటున్న విశాఖ స్టీల్ ప్లాంట్
ఐటి జనరల్ మేనేజర్ కెవిఎస్‌ఎస్ రాజేశ్వరరావు