బిజినెస్

పనే్నతర అవరోధాల తొలగింపే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్) దేశాల వాణిజ్య మంత్రుల సమావేశం అక్టోబర్ 13వ తేదీన న్యూఢిల్లీలో జరుగనుంది. పనే్నతర వాణిజ్య అవరోధాలతో పాటు సేవల రంగం అభివృద్ధి, మేధో సంపత్తి హక్కుల విషయంలో పరస్పరం సహకారాన్ని పెంపొందించుకోవడం తదితర కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎస్‌ఎంఇ) రంగంలో బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించుకోవడంపై కూడా ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుందని ఒక అధికారి తెలిపారు. ఈ సమావేశానికి ముందు ఈ ఐదు దేశాలకు చెందిన సీనియర్ అధికారులు అక్టోబర్ 11, 12 తేదీల్లో సమావేశమై వాణిజ్యం, పెట్టుబడుల అభివృద్ధికి అనుసరించాల్సిన మార్గాలను ఖరారు చేస్తారని ఆ అధికారి వివరించారు. బ్రిక్స్ వాణిజ్య మంత్రుల సమావేశం ముగిసిన తర్వాత ఉమ్మడిగా విడుదలచేసే పత్రాన్ని కూడా ఈ అధికారులే రూపొందిస్తారని భావిస్తున్నట్లు ఆ అధికారి తెలిపారు. ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ప్రమోట్ చేసేందుకు మేధో సంపత్తి హక్కులకు సంబంధించిన అంశాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై కూడా బ్రిక్స్ దేశాలు చర్చించనున్నాయి. దేశీయ ఎగుమతి దారులకు బ్రెజిల్, రష్యా, చైనాలో ఎదురవుతున్న పనే్నతర వాణిజ్య అవరోధాల గురించి భారత్ ఈ సమావేశంలో ప్రస్తావించాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన శానిటరీ, ఫైటోశానిటరీ అంశాలు, సమాచార సాంకేతిక పరిజ్ఞాన (ఐటి) రంగానికి సంబంధించిన కొన్ని నిబంధనలతో పాటు ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అంశాల్లో దేశీయ ఎగుమతిదారులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, తీవ్రమైన అవరోధాలుగా పరిణమించిన వీటి తక్షణమే తొలగించాల్సిన అవసరం ఉందని, ఇలా జరిగినప్పుడే బ్రిక్స్ సభ్య దేశాల మధ్య వాణిజ్యం ఊపందుకుంటుందని భారత ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్‌ఐఇఓ) డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ స్పష్టం చేశారు.
కాగా, బ్రిక్స్ సభ్య దేశాల మధ్య కేవలం ప్రాంతీయ స్థాయిలోనే కాకుండా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఓ) లాంటి అంతర్జాతీయ వేదికల్లో కూడా సహకారం పెరగాల్సిన అవసరం ఉందని న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు)లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ప్రముఖ వాణిజ్య నిపుణుడు విశ్వజీత్ ధర్ ఉద్ఘాటించారు. ‘వాణిజ్య వ్యవహారాల్లో ప్రస్తుతం బ్రిక్స్ సభ్య దేశాల మధ్య సహకారం కొరవడింది. ఇది ఎంతో పెరగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా డబ్ల్యుటిఓ లాంటి అంతర్జాతీయ వాణిజ్య సంస్థలకు సంబంధించిన అంశాల్లో బ్రిక్స్ సభ్య దేశాలు సహకారాన్ని పెంపొందించుకోవాలి’ అని విశ్వజీత్ ధర్ పేర్కొన్నారు.
ఇదిలావుంటే, బ్రిక్స్ వాణిజ్య మంత్రుల సమావేశంతో పాటు బ్రిక్స్ వ్యాపార మండలి కూడా సమావేశమై పెట్టుబడులను పెంపొందించుకునేందుకు అనుసరించాల్సిన మార్గాలపై చర్చించనుంది. అలాగే అక్టోబర్ 12వ తేదీ నుంచి న్యూఢిల్లీలో మూడు రోజుల పాటు వాణిజ్య ప్రదర్శన కూడా జరుగనుంది. భారత్ ఆధ్వర్యంలో అక్టోబర్ 15, 16 తేదీల్లో గోవాలో జరుగనున్న బ్రిక్స్ 8వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ఈ సమావేశాలన్నింటినీ నిర్వహించనున్నారు.