బిజినెస్

ద్రవ్యోల్బణం, ఐఐపి గణాంకాలే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: వచ్చే వారం వెలువడనున్న వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం, పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు దేశీయ స్టాక్ మార్కెట్ల గమనాన్ని నిర్దేశించనున్నాయి. బక్రీద్ కారణంగా మంగళవారం మార్కెట్లకు సెలవు కావడంతో వచ్చేవారం అయిదు రోజులు మాత్రమే మార్కెట్లు పని చేయనున్నాయి. సోమవారం వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం, పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలను ప్రభుత్వం ప్రకటించనుంది. అలాగే బుధవారం టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం వివరాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన ఈ ముఖ్యమైన గణాంకాలు, రుతుపవనాల తీరుతెన్నులు, అంతర్జాతీయ పరిస్థితులు వచ్చే వారం మార్కెట్ గమనాన్ని నిర్దేశించవచ్చని ట్రేడ్‌స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా అభిప్రాయ పడ్డారు. అంతేకాకుండా గత రెండు వారాలు మార్కెట్లలో అన్ని రంగాలకు చెందిన షేర్లు పెరిగిన నేపథ్యంలో వ్యాపారులు లాభార్జనకే మొగ్గు చూపే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని, ఫలితంగా మార్కెట్లు ఒత్తిడికి గురి కావచ్చని కూడా ఆయన అభిప్రాయ పడ్డారు. మార్కెట్లు రికార్డు స్థాయిలకు చేరుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు సర్వసాధారణమేనని కూడా సింఘానియా అభిప్రాయ పడ్డారు. మరోవైపు వచ్చే వారం కోల్‌ఇండియా త్రైమాసిక ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఫలితాల ప్రభావం కూడా మార్కెట్‌పై కొంతమేరకు ఉంటుంది. గత వారం సెనె్సక్స్ 265 పాయింట్లు, నిఫ్టీ 57 పాయింట్లకు పైగా లాభపడ్డం తెలిసిందే.
19 నుంచి కొలేటరల్ ట్రాన్స్‌ఫర్‌కు అనుమతి
ఇదిలా ఉండగా, మార్కెట్లో లావాదేవీలు జరిపే వారు సెక్యూరిటీస్ లెండింగ్, మారోయింగ్ స్కీమ్‌లో నగదు, లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ రిసీట్ల రూపంలో ఉంచిన ప్రత్యామ్నాయ పెట్టుబడులను దానినుంచి వేరే దానికి, అలాగే వేరే వాటినుంచి దానిలోకి మార్చుకోవడానికి జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజి (ఎన్‌ఎస్‌ఇ)ఈ నెల 19నుంచి అనుమతించనుంది. మార్కెట్లో లావాదేవీలు జరిపే ట్రేడర్లు పనిలేకుండా పడి ఉండే ప్రత్యామ్నాయ నిధులను వీలయినంత మేరకు సద్వినియోగం చేసుకోవడానికి ఈ నిర్ణయం తోడ్పడుతుంది. రోజువారీగా ఇలాంటి మార్పిడి చేసుకోవడానికి ఈ నెల 19నుంచి అనుమతించడం జరుగుతుందని ఎన్‌ఎస్‌ఇ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే నిబంధనల ప్రకారం కనీస డిపాజిట్లను కొనసాగించాలనే షరతుపై ఈ మార్పిడికి అనుమతించడం జరుగుతుందని కూడా ఆ ప్రకటనలో తెలిపింది.