బిజినెస్

భారీగా తగ్గిన ఐఫోన్ల ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: భారత్‌లో కొన్ని రకాల ఐఫోన్ల ధరలను తగ్గిస్తున్నట్లు యాపిల్ ఇండియా గురువారం వెల్లడించింది. అమెరికాతో పాటు మరికొన్ని దేశాల్లో ఇటీవల కొత్తగా విడుదల చేసిన ఐఫోన్-7, ఐఫోన్-7 ప్లస్ వేరియంట్లు అక్టోబర్ 7వ తేదీన భారత మార్కెట్లోకి రానుండటంతో ఐఫోన్-6ఎస్, ఐఫోన్-6ఎస్ ప్లస్, ఐఫోన్-ఎస్‌ఇ ధరలను గణనీయంగా తగ్గిస్తున్నామని, ప్రత్యేకించి 128 జిబి మోడల్ ఐఫోన్-6ఎస్, ఐఫోన్-6ఎస్ ప్లస్ మోడళ్ల ధరలను భారీగా తగ్గిస్తున్నామని యాపిల్ ఇండియా ప్రకటించింది. ఇప్పటివరకూ 92 వేల రూపాయలుగా ఉన్న ఐఫోన్-6ఎస్ ప్లస్ 128 జిబి వేరియంట్ ధరను 22 వేల రూపాయలు తగ్గించి రూ.70 వేలకు, అలాగే 82 వేల రూపాయలుగా ఉన్న ఐఫోన్-6ఎస్ 128 జిబి వేరియంట్ ధరను 22 వేల రూపాయలు తగ్గించి రూ.60 వేలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు యాపిల్ ఇండియా స్పష్టం చేసింది. తగ్గించిన ధరల ప్రకారం ఐఫోన్-6ఎస్ ప్లస్ ధర రూ.60 వేల నుంచి, ఐఫోన్-6ఎస్ ధర రూ.50 వేల నుంచి ప్రారంభమవుతుంది. విడుదల చేసినప్పటి ధరలతో పోలిస్తే ఈ ఫోన్ల ధరలు రూ.12 వేల చొప్పున తగ్గాయి. కేవలం ఐఫోన్-6ఎస్ ప్లస్, ఐఫోన్-6ఎస్ ధరలనే కాకుడా 4 అంగుళాల తెరతో ఈ ఏడాది మార్చిలో విడుదల చేసిన ఐఫోన్-ఎస్‌ఇ ధరను కూడా యాపిల్ ఇండియా తగ్గించింది. ఇప్పటివరకూ రూ.49 వేలుగా ఉన్న ఐఫోన్-ఎస్‌ఇ 64 జిబి వేరియంట్ ధర రూ.5 వేలు తగ్గి రూ.44 వేలకు దిగివచ్చింది. అయితే రూ.39 వేలుగా ఉన్న ఐఫోన్-ఎస్‌ఇ 16జిబి వేరియంట్ ధరను మాత్రం యాపిల్ ఇండియా తగ్గించలేదు.

వచ్చేవారం షేర్ల బైబ్యాక్
ఎన్‌ఎండిసి, ఎంఓఐఎల్ ప్రకటన
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: దాదాపు రూ. 8400 కోట్ల విలువైన తమ షేర్ల బై బ్యాక్ కార్యక్రమాలు వచ్చే వారం అంటే ఈ నెల 19న అపారంభమవుతాయని మైనింగ్ దిగ్గజం ఎన్‌ఎండిసి, మాంగనీస్ మైనింగ్ సంస్థ ఎంఓఐఎల్‌లు గురువారం ప్రకటించాయి. ఈ బైబ్యాక్ ద్వారా వచ్చే నిధుల్లో అధిక భాగం ఈ రెండు ప్రభుత్వ రంగ సంస్థల్లో 80 శాతం వాటాలు కలిగి ఉన్న కేంద్రం ప్రభుత్వానికే వెళ్తాయి.వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 56 వేల కోట్ల రూపాయలు సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ బైబ్యాక్ ఆఫర్ ఈ నెల 19న ప్రారంభమయి 30వ తేదీతో ముగుస్తుంది. ప్రతి షేరుకు రూ. 94 ధర చొప్పున మొత్తం రూ. 7,527.76 కోట్ల విలువైన 80.80 కోట్ల షేర్లకు మించకుండా షేర్లను తిరిగి కొనుగోలు చేయాలని ఎన్‌ఎండిసి అనుకుంటోంది. మరోవైపు ఎంఓఐఎల్ ప్రతి షేరు రూ. 248 ధర చొప్పున 3.48 కోట్ల షేర్లను వాటాదారులనుంచి తిరిగి కొనుగోలు చేయాలని అనుకుంటోంది. 2015 మార్చి చివరి నాటికి ఎన్‌ఎండిసి వద్ద రూ. 18,443 కోట్లు, ఎంఓఐఎల్ వద్ద రూ.2,830 కోట్ల మిగులు నిధులున్నాయి.