బిజినెస్

ఎల్‌అండ్‌టి టెక్నాలజీ ఐపిఓకి భారీ స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్‌అండ్‌టి అనుబంధ సంస్థ అయిన ఎల్‌అండ్‌టి టెక్నాలజీ సర్వీసెస్ ఐపిఓ బిడ్డింగ్‌ల చివరి రోజయిన గురువారం మధ్యాహ్నానికి 1.43 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. 72,80,000 షేర్లకు గాను 1,04,33,712 షేర్లకు బిడ్లు వచ్చాయి. గత జూలైలో ఎల్‌అండ్‌టి ఇన్ఫోటెక్ ఐపిఓ మార్కెట్‌లోకి వచ్చినప్పటినుంచి ఎల్‌అండ్‌టి గ్రూపునుంచి మార్కెట్లోకి వచ్చిన రెండో సంస్థ ఇది. ఎల్‌అండ్‌టి టెక్నాలజీస్ గత వారం ప్రధాన ఇనె్వస్టర్లనుంచి రూ. 268 కోట్లు సమీకరించడం తెలిసిందే. కాగా, ఎల్‌అండ్‌టి టెక్నాలజీ ఇష్యూ ప్రైస్ బ్యాండ్ రూ.850-860 మధ్య ఉంటుందని కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇదిలావుంటే, ఆటో పరికరాల తయారీ సంస్థ అయిన జిఎన్‌ఏ యాక్సెల్స్ ఐపిఓ బిడ్డింగ్‌ల రెండో రోజయిన గురువారం మధ్యాహ్నం సమయానికి 1.36 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. 130 కోట్ల ఈ ఐపిఓ ప్రైస్‌బ్యాండ్ ప్రతి షేరుకు రూ. 205-207 మధ్య ఉంటుంది.
హెచ్‌పిఎల్ ఎలక్ట్రిక్ ఇష్యూ
ప్రైస్ బ్యాండ్ రూ.175- 202
కాగా, హెచ్‌పిఎల్ ఎలక్ట్రిక్ అండ్ పవర్ తన ఐపిఓ షేరు ధరను రూ.175-202గా నిర్ణయించింది. రూ. 361 కోట్ల విలువ ఉండే ఈ పబ్లిక్ ఇష్యూ బిడ్డింగ్ ప్రక్రియ ఈ నెల 22న ప్రారంభమయి 26తో ముగుస్తుంది. ఎస్‌బిఐ క్యాపిటల్ మార్కెట్స్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్, ఐడిఎఫ్‌సి మ్యాంక్ ఈ ఇష్యూకు మేనేజర్లుగా ఉంటాయి.