బిజినెస్

వౌలిక వసతులు అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యవేడు/తడ, సెప్టెంబర్ 15: థాయ్‌లాండ్ దేశానికి చెందిన అత్యున్నత శ్రేణి వ్యాపారవేత్తల బృందం శుక్రవారం చిత్తూరు, నెల్లూరు జిల్లాల సరిహద్దులో ఉన్న శ్రీసిటీ సెజ్‌ను సందర్శించింది. ఆ దేశ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అథారిటీ గవర్నర్ వీరపాంగ్ చేయపర్ నేతృత్వంలో 21 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. వీరికి శ్రీసిటీ ఎండి రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికి సెజ్ వౌలికవసతులను, పారిశ్రామిక ప్రగతిని వారికి వివరించారు. అనంతరం ఈ బృందం ఇసుజూ రాక్వర్త్ పరిశ్రమను సందర్శించి అక్కడ ఉత్పత్తుల తీరును సందర్శించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీసిటీలో వసతుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. థాయ్‌లాండ్ దేశం పెట్టుబడులకు శ్రీసిటీ ఎంతో అనుకూలంగా ఉందన్నారు. ఇక్కడ వౌలిక వసతులు, వ్యాపార వాతావరణాన్ని అధ్యయనం చేయడమే తమ పర్యటన ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. తమ ఇండస్ట్రియల్ డవలెప్‌మెంట్ కార్పొరేషన్ నెట్‌వర్క్‌లో భాగస్వాములుగా వ్యాపార సంబంధాలను విస్తరించుకోవడానికి శ్రీసిటీని ఆహ్వానించారు. అనంతరం శ్రీసిటీ ఎండి రవీంద్రసన్నారెడ్డి మాట్లాడుతూ థాయ్‌బృందం పర్యటనపట్ల సంతోషం వ్యక్తం చేశారు. వీరి పర్యటన ఇరుదేశాల వ్యాపార బంధాన్ని మరింత పటిష్ట పరుస్తుందన్నారు. శ్రీసిటీలో మరిన్ని థాయ్‌లాండ్ పరిశ్రమల ఏర్పాటుకు ఇది దోహదపడుతుందన్నారు.