బిజినెస్

మహిళల కోసం డిజిటల్ వెబ్‌సైట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: మహిళలకో శుభవార్త. మహిళల కోసం ప్రత్యేకంగా దివాఆన్‌డ్యూటీ.కామ్ పేరిట డిజిటల్ పబ్లికేషన్ (వెబ్‌సైట్) ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని హోటల్ ఆవాస్‌లో కన్నుల పండువగా జరిగిన వేడుకలో సెలబ్రిటీ త్రిధాచౌదరి ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఫ్యాషన్ బ్లాగర్స్ సాయి రోనక్ ప్రభృతులు వేడుకలో పాల్గొన్నారు. దివాఆన్‌డ్యూటీ వెబ్‌సైట్‌లో మహిళలకు ఫ్యాషన్‌తో పాటు ఆందం, ఆరో గ్యం, లైఫ్ స్టైల్‌పై అవగాహన కల్పించనున్నట్లు సిఇఒ ఇమ్రాన్‌యుద్దీన్ తెలిపారు. సాయిపోలా నుంచి రూ. కోటి పెట్టుబడి వచ్చినట్లు చెప్పారు. వెబ్‌సైట్‌లో ఇన్సిపిరేషన్ అనే క్యాటగిరీ ఉంటుందని ఆయన తెలిపారు. దేశానికి వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖుల గురించి కూడా ఉంటుందని పివి సింధును ఉదహరించారు. ఇంకా ఫ్యాషన్ బ్లాగ్‌లో పాల్గొనేవారికి ఒక వేదికగా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రుషి భరద్వాజ మాట్లాడుతూ ఈ ఫ్యాషన్ టీంలో ఈ రంగంలో నిపుణులైనవారు ఎడిటర్లుగా, రచయితలుగా ఉంటారని వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పిపివో అనురాగ్ బల్‌గామ్, కీర్తన కౌండిన్య, సౌమ్య బండారు, వాసంతి తదితరులు పాల్గొన్నారు.

డిజిటల్
వెబ్‌సైట్ ఆవిష్కరణలో పాల్గొన్న నిర్వాహకులు