బిజినెస్

స్టాక్ మార్కెట్లకు రెండో రోజూ లాభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 15: రోజంతా ఆటుపోట్ల మధ్య సాగిన దేశీయ మార్కెట్లు చివర్లో కొనుగోళ్ల మద్దతుతో పుంజుకోవడంతో లాభాలతో ముగిశాయి. బిఎస్‌ఇ సెనె్సక్స్ 41 పాయింట్లు లాభపడి 28,412.89 పాయింట్ల వద్ద ముగియగా, జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం దాదాపు 16 పాయింట్లు లాభపడి 8,742.55 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రధానంగా ఎఫ్‌ఎంసిజి, హెల్త్‌కేర్, రియల్టీ రంగాలకు చెందిన షేర్లు లాభపడ్డాయి. వచ్చే వారం అమెరికా ఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ పాలసీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తూ ఉండడంతో మార్కెట్లు ఒత్తిళ్లకు గురవుతున్నాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. సోమవారం దేశీ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలకు గురయిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం స్వల్ప లాభాలతో ముగిసిన ప్రధాన సూచీలు బుధవారం బక్రీద్ సెలవు తర్వాత కూడా అదే ధోరణిలో కొనసాగడం గమనార్హం 28,454-28,311 పాయింట్ల మధ్య ఊగిసలాడిన సెనె్సక్స్ చివరికి 40.66 పాయింట్ల లాభంతో 28,412.89 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ సైతం 15.95 పాయింట్లు లాభపడి 8,742.55 పాయింట్ల వద్ద ముగిసింది. సెనె్సక్స్‌లో లాభపడిన వాటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆగ్రభాగాన నిలిచింది. సిప్లా, మారుతి సుజుకి, హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్, ఐటిసి, అదానీ పోర్ట్స్ లాంటి ప్రధాన షేర్లు మంచి లాభాలను ఆర్జించాయి. సెనె్సక్స్‌లోని 30 కంపెనీల్లో 13 కంపెనీల షేర్లు లాభపడగా, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్, ఎంఅండ్‌ఎం, గెయిల్, ఇన్ఫోసిస్, ఎల్‌అండ్‌టి లాంటి 17 కంపెనీల షేర్లు నష్టపోయాయి. లాభాల స్వీకరణ కారణంగా బ్యాకింగ్ రంగ షేర్లు కూడా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలో జపాన్, దక్షిణ కొరియా సూచీలు నష్టపోగా, హంకాంగ్ సూచీ లాభాలతో ముగిసింది. చైనా, దక్షిణ కొరియా, తైవాన్ మార్కెట్లకు ఈ రోజు సెలవు, ఇక ఐరోపా మార్కెట్లలో సైతం ప్రారంభంనుంచి మిశ్రమ ధోరణి కనిపించింది. దేశంలో వర్షాలు మామూలు వర్షపాతానికి మించి ఉంటుందన్న భారత వాతావరణ విభాగం అంచనాలపై అనుమానాలు తలెత్తిన తర్వాత మదుపరుల సెంటిమెంట్ కొంత దెబ్బతిన్నదని నిపుణులు అభిప్రాయ పడ్డారు.