బిజినెస్

జన్ ధన్ ఖాతాల్లో డిపాజిట్లపై దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: జీరో బ్యాలెన్స్ ఖాతాల సంఖ్యను తక్కువగా చూపేందుకు జన్ ధన్ ఖాతాల్లో బ్యాంకర్లే సొమ్మును డిపాజిట్ చేశారా? లేక ఆ సొమ్మును ఖాతాదారులే డిపాజిట్ చేసుకున్నారా? అనే అంశంపై ప్రభుత్వ రంగంలోని నాలుగు బ్యాంకులు శాఖాపరమైన దర్యాప్తు జరుపుతున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం వెల్లడించారు. పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్ (పిఎస్‌బి), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి), బ్యాంక్ ఆఫ్ బరోడా (బిఓబి), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బిఓఐ) తదితర కొన్ని బ్యాంకులకు చెందిన శాఖలు జీరో బ్యాలెన్స్ ఖాతాల సంఖ్యను తక్కువగా చూపేందుకు జన్ ధన్ ఖాతాల్లో ఒక్కో రూపాయి చొప్పున జమ చేసినట్లు వచ్చిన వార్తల గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ జైట్లీ పై విషయాన్ని వెల్లడించారు.
యాదాద్రి థర్మల్ ప్రాజెక్టుకు
అనుమతిలో జాప్యం
మరిన్ని వివరాలు కోరిన కేంద్రం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 16: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 8000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ స్టేషన్‌కు పర్యావరణ అనుమతులు లభించడంలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. సరైన డాక్యుమెంటేషన్ లేనందువల్ల ఈ ప్రాజెక్టుకు పర్యావరణ సంబంధ క్లియరెన్సు ఇచ్చే విషయంలో నిర్ణయాన్ని వాయిదా వేయాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల కమిటీ పేర్కొంది. పర్యావరణ ప్రభావం అంచనా నివేదిక అసంపూర్తిగా ఉందని, కమిటీ ప్రస్తావించిన అభ్యంతరాలపై ఇంకా వివరాలు ఇవ్వాలని ఈ కమిటీ రాష్ట్ర విద్యుత్ శాఖను కోరింది. నివేదికలో కొన్ని చోట్ల బొగ్గు రెండు పోర్టుల నుంచి, మరొకచోట నాలుగు పోర్టుల నుంచి బొగ్గు వస్తుందని పేర్కొన్నారని కమిటీ పేర్కొంది. పూర్తి వివరాలతో కార్యాచరణ ప్రణాళికను ఇవ్వాలని ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
65 వేల ఎకరాల్లో
సోయా విత్తనోత్పత్తి
టి.వ్యవసాయ శాఖ కార్యదర్శి వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 16: తెలంగాణలో తొలిసారిగా ఖరీఫ్ సీజన్‌లో 65 వేల ఎకరాల్లో సోయా చిక్కుడు విత్తనోత్పత్తి జరుగుతున్నట్టు వ్యవసాయ ఉత్పత్తుల కమిషనర్ సి పార్థసారథి తెలిపారు. హాకా భవన్‌లో శుక్రవారం తెలంగాణ విత్తన ఉత్పత్తి సంస్థ, విత్తన దృవీకరణ సంస్థ జిల్లా అధికారులు, ప్రభుత్వ, ప్రైవేటు విత్తన కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. తొలిసారిగా ప్రభుత్వం సోయాబిన్ విత్తన ఉత్పత్తిని ఒక సవాల్‌గా తీసుకుందని చెప్పారు. తెలంగాణ విత్తనాలు నాణ్యమైనవి అనే నమ్మకం కలిగే విధంగా రైతులు నాణ్యమైన విత్తనాలు ఉత్పత్తి చేసే విధంగా సహకరించాలని కోరారు. నాణ్యమైన విత్తన ఉత్పత్తికి అధికారులు నిత్యం క్ష్రేత్ర స్థాయిలో తనిఖీలు జరిపి, రైతులకు జాగ్రత్తలు చెప్పాలన్నారు. సమావేశంలో విత్తన ఉత్పత్తి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మురళి, విత్తన దృవీకరణ సంస్థ డైరెక్టర్ కేశవులు పాల్గొన్నారు.