బిజినెస్

రైతులకు విప్రో అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబరు 16: వ్యవసాయాన్ని లాభసాటి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి ఆలంబనగా నిలుస్తూ, ఏపి ప్రభుత్వానికి చేదోడువాదోడుగా ఉండేందుకు విప్రో సంస్థ ముందుకు వచ్చింది. అజీమ్ ప్రేమ్‌జీ ఫిలాంధ్రోపిక్ ఇనీసియేషన్స్ (ఏపిపిఐ) పేరిట నిర్వహిస్తున్న దాఅతృత్వ కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రంలోని చిన్న, మధ్యతరహా రైతుల ఆదాయం పెంచి వారికి మెరుగైన జీవన స్థితిగతులు కల్పించడానికి ఈ సంస్థ ముందుకు వచ్చింది. జిల్లాకు 10 క్లస్టర్ల చొప్పున మొత్తం 130 క్లస్టర్ల ద్వారా సేద్యంలో చిన్న తరహా, మధ్య తరహా రైతులకు ఉపకరించే అంశాల్లో ప్రభుత్వానికి సహకరిస్తామని ఏపిపిఐ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు హమీ ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం విజయవాడలోని సిఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుతో ఏపిపిఐ ప్రతినిధులు భేటీ అయ్యారు. వ్యవసాయ పెట్టుబడులను తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మలచాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని తాము ఇక్కడికి వచ్చామని ఏపిపిఐ ప్రతినిధులు చెప్పారు. ఏపిలో సంప్రదాయ సేద్యం అనేక దశల్లో రూపాంతరం చెంది ప్రస్తుతం రైతు కేంద్రీకృతంగా సరికొత్త రూపుదాల్చిందని, జీరో బడ్జెట్ సేద్యానికి రూపకల్పన, కరవు రహిత కార్యక్రమాల నిర్వహణ, వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు, జల వనరుల సమర్థ వినియోగం వంటి అంశాల్లో ప్రభుత్వ చొరవ దేశానికే ఆదర్శంగా నిలిచిందని విప్రో ప్రతినిధులు కొనియాడారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ బిల్ గేట్స్‌లా భారత్‌లో విప్రో ప్రేమ్‌జీ దాతృత్వ కార్యక్రమాలకు పెద్దపీట వేసి తోటి కార్పొరేట్ సంస్థలకు ఆదర్శంగా నిలవడం తననెంతో ప్రభావితం చేసిందని అన్నారు. ఏపిలో రైతాంగ శ్రేయస్సును కాంక్షించి, తమతో కలిసి పనిచేయడానికి ఏపిపిఐ ముందుకు రావడంపట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. గడచిన దశాబ్దంలో వ్యవసాయరంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొందని అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మలిచి, రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి రెండున్నరేళ్లపాటు శ్రమించానని చంద్రబాబు చెప్పారు. తాను తీసుకున్న నిర్ణయాలు త్వరలోనే సత్ఫలితాలను ఇవ్వనున్నాయని చంద్రబాబు చెప్పారు. ఏడు గంటల పాటు నిరంతర విద్యుత్, విస్తృత భూసార పరీక్షలు నిర్వహించడం, నేలకు సమతుల్య పోషక విలువల్ని అందించడం, రసాయన ఎరువుల విచ్చలవిడి వాడకాన్ని నియంత్రించడం వంటి అనేక చర్యలు వ్యవయంలో పెను మార్పులు తీసుకువచ్చాయని అన్నారు. రెయిన్‌గన్‌లు, స్ప్రింకర్లతో కరవును చాలా వరకూ నివారించగలిగామని ఆయన చెప్పారు. ఈ భేటీలో విప్రో ఏపిపిఐ ప్రతినిధి ఆనంద్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి విజయకుమార్ పాల్గొన్నారు.
సిఎం చంద్రబాబుతో మాట్లాడుతున్న విప్రో సంస్థ ప్రతినిధులు