బిజినెస్

పప్పు ధాన్యాలకు మరింత మద్దతు ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: దేశంలో పప్పు ధాన్యాల సాగుకు ఊతమిచ్చి ధరలను అదుపులో ఉంచేందుకు వీలుగా రైతులకు తక్షణమే మరింత కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) ప్రకటించాలని ప్రధాన ఆర్థిక సలహాదారు (సిఇఎ) అరవింద్ సుబ్రమణియన్ నేతృత్వంలోని కమిటీ శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ ఏడాది రబీ సీజన్‌లో క్వింటాలు శనగలకు 4 వేల రూపాయలు, వచ్చే ఏడాది ఖరీఫ్ సీజన్‌లో క్వింటాలు కందులు, మినుములకు 6 వేల రూపాయల చొప్పున కనీస మద్దతు ధర ప్రకటించాలని ఈ కమిటీ పేర్కొంది. దేశంలో 20 లక్షల టన్నుల మిగులు నిల్వలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ‘యుద్ధ ప్రాతిపదికన’ పప్పు్ధన్యాలను కొనుగోలు చేయాలని, అలాగే ఎపిఎంసి నుంచి పప్పుదినుసులను డీలిస్టు చేసేలా రాష్ట్రాలపై వత్తిడి తీసుకొచ్చి, జన్యు మార్పిడి సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిని ప్రోత్సహించడంతో పాటు పప్పు్ధన్యాలను సాగుచేసే రైతులకు రాయితీలను అందజేయాలని ఈ కమిటీ సిఫారసు చేసింది. ‘ఇన్‌సెంటివైజింగ్ పల్సెస్ ప్రొడక్షన్ త్రూ మినిమమ్ సపోర్ట్ ప్రైస్ (ఎంఎస్‌పి) అండ్ రిలేటెడ్ పాలసీస్’ అనే పేరుతో ఈ కమిటీ రూపొందించిన నివేదికను సిఇఎ అరవింద్ సుబ్రమణియన్ శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి సమర్పించారు. దేశంలో ఇటీవల పప్పు్ధన్యాల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. మార్కెట్లో తరచుగా చోటుచేసుకుంటున్న ధరల ఒడిదుడుకులను తగ్గించి ప్రజలకు సరసమైన ధరలకే పప్పు్ధన్యాలు అందుబాటులో ఉండేలా చూడటంతో పాటు రైతులు, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు దేశీయంగా పప్పు్ధన్యాల ఉత్పాదకతను, ఉత్పత్తిని వేగవంతంగా పెంచడం ఒక్కటే సరైన మార్గమని గట్టిగా అభిప్రాయపడుతున్నట్లు ఈ కమిటీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

కేంద్ర మంత్రులకు నివేదిక సమర్పించిన సిఇఎ అరవింద్ సుబ్రమణియన్

సుబ్రతా రాయ్‌కి పెరోల్ పొడిగింపు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: సహారా గ్రూపు సంస్థల అధినేత సుబ్రతా రాయ్‌కి మంజూరు చేసిన పెరోల్ గడువును ఈ నెల 23వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు సుప్రీం కోర్టు శుక్రవారం ప్రకటించింది. సుబ్రతా రాయ్ తల్లి చనిపోవడంతో మానవతా కారణలపై మే నెలలో ఆయనకు పెరోల్ మంజూరు చేసిన న్యాయస్థానం, ఆ తర్వాత సహారా పెట్టుబడిదారులకు వాపసు ఇవ్వాల్సిన సొమ్మును సమకూర్చేందుకు వీలుగా పెరోల్‌ను పొడిగించిన విషయం తెలిసిందే. దీని గడువు శుక్రవారంతో ముగియనుండటంతో సుబ్రతా రాయ్ పెరోల్‌ను ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్.్ఠకూర్ తన చాంబర్‌లోనే నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక ధర్మాసనంలో సభ్యులుగా ఉన్న జస్టిస్ ఎఆర్.దవే, జస్టిస్ ఎకె.సిక్రీ అందుబాటులో లేకపోవడంతో చీఫ్ జస్టిస్ ఠాకూర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఏపిలో ప్రపంచ బ్యాంకు బృందం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, సెప్టెంబర్ 16: సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో ప్రభుత్వ పథకాలను సమర్థత, పారదర్శకతలతో ప్రజల ముంగిట చేరవేతపై అధ్యయనం చేసి తమ దేశంలో అమలుచేసే ఉద్దేశంతో టాంజనియా దేశానికి చెందిన నేషనల్ ఐడెంటిఫికేషన్ అథారిటీ (ఎన్‌ఐడిఎ) డైరెక్టర్, శ్రీ ఆల్పోన్స్ మ్యాలిబెక్ 11 మంది సభ్యులతో కూడిన ప్రపంచ బ్యాంక్ సిబ్బంది నేతృత్వంలో ఓ బృందం కృష్ణాజిల్లాలో తమ రెండురోజుల పర్యటనను శుక్రవారం ప్రారంభించింది. టాంజానియా ‘సోషల్ యాక్షన్ ఫండ్’ పేరిట తమ దేశంలో అమలవుతున్న పేదరిక నిర్మూలన పథకంలో చెల్లింపులు ఆన్‌లైన్‌లో చేసేందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని జిల్లా పర్యటనలో సేకరించడం పర్యటన ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ పర్యటనలో భాగంగా తొలిరోజు శుక్రవారం విజయవాడ రూరల్ మండలం పాతపాడు, నున్న, గొల్లపూడి, రాయనపాడు, గుంటుపల్లి గ్రామాల్లో జిల్లా కలెక్టర్ బాబు.ఎ ఆధ్వర్యంలో అమలవుతున్న ఆధార్ అనుసంధాన పథకాల తీరు తెన్నులను అధ్యయనం చేసింది. ఈ సందర్భంగా పాతపాడు గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఆన్‌లైన్ విధానం ద్వారా కూలీల వేతనాల చెల్లింపును బృందం అధ్యయనం చేసింది. ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ వేతనదారుకే చెల్లింపులు జరుగుతున్నట్లు నిర్థారణ ఏ విధంగా జరుగుతోందని ప్రశ్నించారు. దీనిపై డ్వామా పిడి మాధవీలత మాట్లాడుతూ ప్రతి వేతనదారు ఆధార్ సంఖ్యను హాజరుకు, అతను చేసిన పనికి అనుసంధానం చేయడం, చేసిన పని పరిమాణాన్ని ఆన్‌లైన్ విధానంలో నమోదు చేయడం, దాని ద్వారా చెల్లింపులు నిర్థారించడం జరుగుతోందని వివరించారు. చెల్లింపులు జరిపే సమయంలో బయోమెట్రిక్ విధానం ద్వారా వేతనదారుని వేలిముద్రను సరిచూసి అభ్యర్థిత్వాన్ని నిర్థారించడం జరుగుతోందని ఎంపిడివో వై.బ్రహ్మయ్య బృందానికి వివరించారు. వేతన చెల్లింపులు ఆయా గ్రామాల్లోని బ్యాంకు మిత్రల ద్వారా చేయడం జరుగుతోందన్నారు. వేతనదారునికి ఏ బ్యాంకులో ఖాతా ఉన్నప్పటికీ ‘ఇంటర్ ఆఫరాబులిటి’ విధానంలో మైక్రో ఎటిఎంల ద్వారా చెల్లింపులు చేస్తున్న విధానాన్ని ప్రత్యక్షంగా చెల్లింపులు చేపట్టి బృందానికి ఎంపిడివో వివరించారు. మైక్రో ఎటిఎం ద్వారా ఇ-కెవైసి విధానంలో బ్యాంకు అకౌంటు తెరచే విధానాన్ని డిడివో అనంతకృష్ణ బృందం సభ్యులకు వివరించారు.
పెన్షన్ల పంపిణీపై పరిశీలన
అనంతరం నున్న గ్రామంలో జిల్లాలో ఆధార్ అనుసంధానంతో ఆన్‌లైన్ విధానం అమలవుతున్న పెన్షన్లు పంపిణీ వ్యవస్థను బృందం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా బయోమెట్రిక్ విధానంలో ఇంటారఫర్‌బులిటి పద్ధతి ద్వారా పెన్షన్లు వారి వారి ఇళ్ల వద్దనే అందించే సౌకర్యాన్ని కల్పించడం జరిగిందని డిఆర్‌డిఎ పిడి బి.చంద్రశేఖర్‌రాజు తెలిపారు. జిల్లా మొత్తం మీద ప్రతి నెల 3.5 లక్షల మంది పెన్షనర్లకు రూ.36 కోట్ల చెల్లింపులు జరుపుతున్నామన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరిగానే నేరుగా పెన్షన్‌దారుల ఖాతాలకు పెన్షన్ సొమ్ము జమచేయడం జరుగుతోందన్నారు. వారి ఆధార్ సంఖ్య ఆధారంగా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ద్వారా మైక్రో ఎటిఎంలను వినియోగించి పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. టాంజానియా అధికార ప్రతినిధుల ప్రపంచ బ్యాంకు బృందం సభ్యుల పర్యటనను సబ్ కలెక్టర్ సృజన స్వయంగా పర్యవేక్షించారు.

అధికారులతో మాట్లాడుతున్న ప్రపంచ బ్యాంకు బృందం