బిజినెస్

ద్రవ్యోల్బణానికి తగ్గట్లే వడ్డీరేట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: అక్టోబర్ 4వ తేదీన జరిగే ద్రవ్య విధాన సమీక్షా సమావేశంలో వడ్డీ రేట్లపై రిజర్వు బ్యాంకు నిర్ణయం తీసుకునేటప్పుడు ద్రవ్యోల్బణం తగ్గుదలను దృష్టి ఉంచుకుని అందుకు అనుగుణంగా నడుచుకుంటుందని ఆశిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం తెలిపారు. ద్రవ్యోల్బణ తగ్గుదలతో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందా? అని జైట్లీని ప్రశ్నించగా, ద్రవ్య విధానంపై వచ్చే నెలలో రిజర్వు బ్యాంకు సమీక్ష జరిపే నాటికి ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) ఏర్పాటు కూడా జరుగుతుందని, అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని వడ్డీ రేట్లపై ఇవి రెండూ (ఆర్‌బిఐ, ఎంపిసి) సమష్టిగా నిర్ణయం తీసుకుంటాయని ఆశిస్తున్నానని చెప్పారు. ‘రిజర్వు బ్యాంకు బాధ్యతాయుతమైన సంస్థ. వడ్డీ రేట్లపై రిజర్వు బ్యాంకు తీసుకునే నిర్ణయం కోసం మనం ఎదురుచూడటంతో పాటు ఆ నిర్ణయాన్ని విశ్వసించాల్సిందే’ అని జైట్లీ పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ద్రవ్యోల్బణాన్ని 5 శాతానికి తగ్గించాలన్న లక్ష్య సాధనలో మున్ముందు ఇబ్బందులు ఎదురుకావచ్చని పేర్కొంటూ రిజర్వు బ్యాంకు గత నెలలో జరిపిన ద్రవ్య విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యధాతథంగా కొనసాగించిన విషయం తెలిసిందే. అయితే ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 5.05 శాతానికి తగ్గి ఐదు నెలల కనిష్ఠ స్థాయికి చేరుకుంది. దీనికి తోడు జులైలో పారిశ్రామిక ఉత్పత్తి 2.4 శాతం క్షీణించినందున వృద్ధికి ఊతమిచ్చేందుకు అక్టోబర్ 4న జరిపే తదుపరి ద్రవ్య విధాన సమీక్షలో రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న ఆశలు జోరందుకున్నాయి.
ఎస్‌బిఐలో అనుబంధ
బ్యాంకుల విలీనం ఆగదు..
ఇదిలావుంటే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐబి)లో అనుబంధ బ్యాంకులతో పాటు భారతీయ మహిళా బ్యాంకు (బిఎంబి)ను విలీనం చేయాలన్న ప్రతిపాదనపై బ్యాంకు ఉద్యోగుల సంఘాలు వ్యక్తం చేస్తున్న నిరసనలను ఏమాత్రం ఖాతరు చేసే ప్రసక్తే లేదని జైట్లీ తేల్చి చెప్పారు. కేంద్ర మంత్రివర్గం అత్యున్నత స్థాయిలో ఈ విలీన ప్రతిపాదనను ఆమోదించినందున ప్రభుత్వం ఈ విషయంలో ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరుపై శుక్రవారం న్యూఢిల్లీలో నిర్వహించిన సమీక్షా సమావేశం ముగిసిన తర్వాత జైట్లీ విలేఖర్లతో మాట్లాడుతూ పై విషయాన్ని స్పష్టం చేశారు. ‘ఎస్‌బిఐలో అనుబంధ బ్యాంకులతో పాటు భారతీయ మహిళా బ్యాంకును విలీనం చేయాలన్న ప్రతిపాదనకు పూర్తి మద్దతు ఇవ్వాలని మంత్రివర్గ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కనుక ఈ విలీన ప్రక్రియ కొనసాగుతుంది’ అని జైట్లీ పేర్కొన్నారు.

చిత్రం... ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరుపై సమీక్షిస్తున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ