బిజినెస్

ఏడాది చివరికి తగ్గనున్న చమురు సంక్షోభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, సెప్టెంబర్ 17: అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పతనం చమురు కంపెనీలను తీవ్రంగా దెబ్బతీసినప్పటికీ, వినియోగదారులు మాత్రం ధరలు తగ్గడంపై చాలావరకు సంతోషంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ సంక్షోభం ఈ ఏడాది చివరికి సడలవచ్చని అంతర్జాతీయ ఎనర్జీ ఏజన్సీ (ఐఇఏ) అభిప్రాయ పడింది. ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలు (ఒపెక్) ఉత్పత్తి స్తంభనకు అంగీకరించినా, సరఫరాలపై దాని ప్రభావం పరిమితంగానే ఉంటుందని ఐఇఏ పేర్కొంది. మితిమీరిన సరఫరాల కారణంగా తీవ్రమైన ఒత్తిడికి గురయిన చమురు మార్కెట్ ఈ ఏడాది రెండో అర్ధ్భాగంనుంచి కుదుటపడడం ప్రారంభం కావచ్చని 29 దేశాలు సభ్యులుగా ఉన్న ఐఇఏ అభిప్రాయ పడింది. ఈ ఏడాది ప్రారంభంలో 30 డాలర్ల దిగువకు పడిపోయిన బ్యారెల్ ముడి చమురు ధర ఇప్పుడు 45 డాలర్లను దాటిన విషయం తెలిసిందే. అయితే 2014 మధ్యలో 100 బ్యారెల్ వంద డాలర్లను దాటిపోయిన దానితో పోలిస్తే ఇది ఇప్పటికీ తక్కువే. చమురు డిమాండ్ నిలకడగా పెరిగే అవకాశం, అలాగే ఒపెక్‌లో సభ్యత్వం లేని దేశాలనుంచి సరఫరాలు తగ్గడం జరుగుతుందని తాను ఇప్పటికీ భావిస్తున్నట్లు ఐఇఏ తన నెలవారీ చమురు మార్కెట్ నివేదికలో పేర్కొంది. ఒపెక్‌లో చక్రం తిప్పే సౌదీ అరేబియా, ఒపెక్‌లో సభ్యత్వం లేని రష్యా దేశాలు ఇప్పటికీ చమురు ఉత్పత్తిని స్తంభింపజేయాలనే దానిపై ఒక ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ఇటీవల వార్తలు రావడమే చమురు ధరలు పెరగడానికి ప్రధాన కారణం. అయితే దోహా సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారో ఇంకా తెలియదని, అయినప్పటికీ, ఒక వేళ ఉత్పత్తి స్తంభనకు అంగీకారం కుదిరినా చమురు సరఫరాలపై దాని ప్రభావం పరిమితంగానే ఉంటుందని ఐఇఏ తన నివేదికలో అభిప్రాయ పడింది.

అనంతలో వజ్రాల కోసం తవ్వకాలు

ఉరవకొండ, సెప్టెంబర్ 17: అనంతపురం జిల్లాలో వజ్ర నిక్షేపాల కోసం తవ్వకాలు జరుగుతున్నాయి. జిల్లాలోని ఉరవకొండ మండలం తుమ్మటపల్లి గ్రామం వద్ద వజ్ర నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు గుర్తించారు. వజ్రాల పరిశోధనలో భాగంగా గ్రామం వద్ద గత 15 రోజుల నుండి మట్టి తవ్వకాలు చేపట్టారు. వజ్రకరూరులోని జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. సుమారు 300 టన్నుల మట్టిని వజ్రకరూరులోని వజ్రాల పరిశోధన కేంద్రానికి తరలించారు. ఈ కేంద్రంలో మట్టిని శుద్ది చేస్తున్నారు. తుమ్మటపల్లిలో సేకరించిన మట్టిలో వజ్రాల శాతాన్ని గుర్తిస్తారు. మండలంలోని లత్తవరం, లత్తవరం తండాలో కింబర్‌లైట్లను శాస్తవ్రేత్తలు గుర్తించారు. 2 నెలల్లో మట్టిని శుద్ధిచేసి తుమ్మటపల్లి ప్రాంతంలో శాటిలైట్ ద్వారా వజ్రాల కోసం సర్వే చేపట్టనున్నట్లు సమాచారం.