బిజినెస్

కొంప ముంచిన ‘ఫెడ్’ భయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 17: ద్రవ్యోల్బణం పెరుగుదల, జూలై నెలలో పారివ్రామిక ఉత్పత్తి తగ్గిపోవడానికి తోడు విదేశీ పెట్టుబడులు తరలిపోవడం లాంటి పలు కారణంగా రెండు వారాలుగా లాభాల్లో సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం నష్టాల్లో ముగిశాయి. ఆగస్టు నెలలో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం రెండు నెలల గరిష్ఠ స్థాయి అయిన 3.74 శాతానికి పెరగడం తెలిసిందే. అయితే వినియోగదారుల ధరల సూచీ అధారిత ద్రవ్యోల్బణం మాత్రం అయిదు నెలల కనిష్టస్థాయి 5.05 శాతానికి పడిపోయింది. మరోవైపు ఉత్పాదక, వౌలిక వస్తువుల రంగాల్లో ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయిన కారణంగా జూలైలో పారిశ్రామిక ఉత్పత్తి 8 నెలల్లో ఎన్నడూ లేనంత తక్కువగా 2.4 శాతానికి పడిపోయింది. వారం ప్రారంభంలో క్రితం వారం ముగింపుకన్నా తక్కువ స్థాయిలో 28,481 పాయింట్ల వద్ద ప్రారంభమైన బిఎస్‌ఇ సెనె్సక్స్ ఆ తర్వాత అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతుందన్న భయాల కారణంగా భారీ అమ్మకాల ఒత్తిడితో 28,251 పాయింట్లకు పడిపోయింది. అయితే వారం చివర్లో అ భయాలు తొలగిపోవడంతో ఆ రోజు సంభవించిన భారీ నష్టాలనుంచి సెనె్సక్స్ కోలుకుని ఒక దశలో 28,778 పాయింట్ల దాకా పెరిగినా చివరికి 198.22 పాయింట్ల నష్టంతో 28,599.03 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స చేంజి సూచీ నిఫ్టీ సైతం 87 పాయింట్లు నష్టపోయి 8,779.85 వద్దకు చేరుకుంది. గత రెండు వారాల్లో సెనె్సక్స్ 1015 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 294 పాయింట్లకు పైగా లాభపడ్డం తెలిసిందే.
ఇదిలా ఉండగా, అక్టోబర్ 4న జరిగే తన ద్రవ్య పరపతి విధానం సమీక్ష సందర్భంగా ఆర్‌బిఐ వడ్డీ రేట్లను నిర్ణయించేటప్పుడు రిటైల్ ద్రవ్యోల్బణంలో తగ్గుదలను దృష్టిలో పెట్టుకుందన్న ఆశాభావాన్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యక్తం చేశారు. అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ గనుక వచ్చే వారం వడ్డీ రేట్లను పెంచినట్లయితే డాలర్ల రాకడ ఆగిపోయి మార్కెట్లనుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోవచ్చని, ఫలితంగా బ్యాంకింగ్, మెటల్ రంగాల షేర్లు పడిపోయే ప్రమాదం ఉందని మదుపరులు భయపడుతున్నారు. కాగా, గత వారం విదేశీ పోర్ట్ఫులియో ఇనె్వస్టర్లు(ఎఫ్‌పిఐ), విదేశీ సంస్థాగత ఇనె్వస్టర్లు(ఎఫ్‌ఐఐ) కలిసి రూ. 57.69 కోట్ల విలువైన షేర్లను విక్రయించినట్లు సెబి లెక్కలను బట్టి తెలుస్తోంది. గత వారం బిఎస్‌ఇ సెనె్సక్స్‌లోని 30 షేర్లలో 21 కంపెనీల స్టాక్స్ నష్టపోగా, కేవలం 9 మాత్రమే లాభాలతో ముగిశాయి. టాటా స్టీల్ షేరు ఏకంగా 8.99 శాతం పడిపోయింది. బక్రీద్ కారణంగా మంగళవారం స్టాక్ మార్కెట్లకు సెలవు కావడంతో గత వారం నాలుగు రోజులే లావాదేవీలు జరిగాయి.
మరో వైపు విదేశీ మార్కెట్లలో స్తబ్దత కారణంగా నగల తయారీదారులు, స్టాకిస్టులనుంచి పెద్దగా కొనుగోళ్లు లేకపోవడంతో బంగారం ధరలు సైతం తగ్గాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచడం ఖాయమన్న నమ్మకంతో కొనుగోలుదారులు కొనుగోళ్లకు దూరంగా ఉండడంతో బంగారానికి డిమాండ్ తగ్గింది. మరోవైపు ధర ఎక్కువగా ఉండడంతో చిల్లర కొనుగోలుదారులు కూడా పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో దేశంలో బంగారానికి డిమాండ్ తక్కువగా ఉంది. వెండి పరిస్థితి కూడా దాదాపు ఇదే.