బిజినెస్

వేరుశనగ రైతుల్లో ఆశలు ఆవిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, సెప్టెంబర్ 17: ఖరీఫ్ సీజన్‌లో వేరుశనగ రైతులు పంటపై ఆశలు వదులు కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో ఈపంటకు అనుకూలంగా వర్షం కురవడంతో పాటు రైతులు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందజేయడంలో అధికార యంత్రాగం ప్రత్యేక చొరవ చూపడంతో రైతులు ఉత్సాహంతో పంట సాగుపై దృష్టి పెట్టారు. తీరా పంట చేతికి వచ్చే సమయానికి వరుణ దేవుడు కనె్నర్ర చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఈతరుణంలో పంటను కాపాడు కోవడానికి ప్రభుత్వం వినూత్న రీతిలో రెయన్ గన్స్‌తో పంటకు నీటిని అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. ముఖ్యమంత్రి నుంచి మంత్రులు కలెక్టర్ ఇతర అధికార యంత్రంగా అంతా పొలాల బాట పట్టారు, ఎండి పోతున్న పంటకు రెయిన్ గన్స్ ద్వారా నీటిని అందించి పంటను కాపాడాలని సత విధాలుగా ప్రయత్నించారు. అయినా ఆశించిన ఫలితం దక్కలేదు. గత ఏడాది వర్షాభావ పరిస్థితి కారణంగా పంట తుడిచి పెట్టుకు పోయింది. దీంతో ఈ జిల్లాలో ఈ ఏడాది సీజన్ ప్రారంభంలో పంటకు అనుకూలంగా వర్షం కురుస్తూ రావడంతో రికార్డు స్ధాయిలో 1.32 లక్షల హెక్టార్లలో పంటను సాగు చేశారు. జిల్లాలో ముఖ్యవాణిజ్య పంట వేరుశనగే , అందులోను వర్షాధారంపైనే ఆధార పడి రైతులు ఈ పంటను సాగు చేస్తారు. గత నాలుగు సంవత్సరాలుగా వర్షాలు సక్రమంగా కురవక పోవడంతో తీవ్రంగా నష్ట పోయిన వేరుశనగ రైతులు ఈసారి సీజన్ లో మంచి వర్షాలు కురుస్తూ రావడంతో రెట్టింపు ఉత్సాహంతో ఈ పంటపై మక్కువ చూపారు. అయితే తీరా పంట చేతికి వచ్చే సమయానికి వరుణ దేవుడు కనుకరించక పోవడంతో నష్టాలు అనివార్యమయ్యాయి. ముఖ్యంగా మదన పల్లి డివిజన్‌లో తీవ్రంగా పంటకు నష్టం వాటిల్లింది. ఈడివిజన్‌లో ప్రధాన పంట ఇదే. దీనిపైనే రైతులు ఆధారపడతారు. గత నాలుగు సంవత్సరాలుగా పంట దక్కక పోవడంతో ఈ సారి మంచి పంట వచ్చి తమ కష్టాలు తీరుతాయని ఆశించిన రైతులకు చివరకు నిరాశే మిగిలింది. జిల్లాలో తూర్పు ప్రాంతాల్లోని మండలాల్లో కొంత వరకు పంట ఆశాజనంగా ఉన్నా పడమర మండలాల్లో పరిస్థితి చేజారి పోయింది. మదనపల్లి డివిజన్‌లో దాదాపు పంట తుడిచి పెట్టుకు పోయింది. ఎటు చూసినా ఎండిన పంట పొలాలే దర్శన మిస్తున్నాయి. ప్రస్తుతం భారీ వర్షం కురిసినా ఆశించిన ఫలితం మాత్రం దక్కని పరిస్థితి. దీంతో పంట సాగుకోసం చేసిన అప్పులకు కనీసం వడ్డీలు కూడా దక్కని దయనీయ పరిస్థితి నెలకొంది. పంట మంచి దిగుబడి రావాలంటే ఆగస్టులో మంచి వర్షాలు కురవాల్సి ఉంది. అయితే ఈ ఏడాది ఆగస్టు నెలలో 117.4 మి,మీ వర్షం కురవాల్సి ఉండగా కేవలం 22.8 మి,మీ వర్షం కురిసింది. ఈనెలలో ఇప్పటికి 141 మి,మీ లకు గాను 22.9 మి. మీ వర్షం కురిసింది. జిల్లాలో 50రోజులుగా వర్షాలు కురవక పోవడంతో సుమారు 30మండాలకు పైగా ప్రతికూల పరిస్థితులు నెలకొంది. ఈ ప్రభావం వేరుశనగ పంటపై తీవ్రంగా చూపింది. దీంతో పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోవడంతో పాటు వేరుశనగ పొలాలు ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. దీంతో వేరుశనగ రైతులు ఆయోమయంలో పడ్డారు. గతం తొలి విడత నీతి తడుల్లో చూపిన ఉత్సాహం మలి విడతలో లేకపోవడంతో రైతుల్లో ఆశలు కూడా సన్నగిల్లాయి. దీంతో ఈ ఏడాది ఖరీప్ సీజన్ వేరుశనగ రైతులకు చేదు అనుభవమే మిగిలింది. కనీసం ప్రభుత్వం పంటకు నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

అమాత్యులే రంగంలోకి దిగినా.. తీరని రైతన్నల కష్టం!