బిజినెస్

మొండిబకాయిలు తగ్గుతాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: భారత బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిలు ఏర్పడడం తగ్గుముఖం పడుతుందని, ఫలితంగా రాబోయే ఏడాది, ఏడాదిన్నర కాలంలో బ్యాంకింగ్ రంగం స్థిరమైన అభివృద్ధి సాధిస్తుందని ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ ఇనె్వస్టర్ సర్వీసెస్ అంచనా వేసింది. గత కొనే్నళ్లతో పోలిస్తే ఇప్పుడు మొండి బకాయిలు ఏర్పడడం తగ్గిందని మూడీస్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ క్రెడిట్ ఆఫీసర్ శ్రీకాంత్ వడ్లమాని విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. భారత బ్యాంకింగ్ వ్యవస్థ చెడ్డకాలాన్ని అధిగమించి వేగంగా ముందుకు సాగుతోందని, రాబోయే 12-18 నెలల కాలంలో ఈ రంగం నిలకడయిన వృద్ధిని సాధిస్తుందని మూడీస్ ఒక నివేదికలో అభిప్రాయం వ్యక్తం చేసింది.
భారత ప్రభుత్వ రంగ బ్యాంకులు, అలాగే ప్రైవేట్ రంగ బ్యాంకుల పనితీరు భిన్నంగా ఉండడం కొనసాగుతుందని వడ్లమాని చెప్పారు. రాబోయే మూడేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెప్పుకోదగ మొత్తంలో పెట్టుబడుల అవసరం ఉంది. అదే సమయంలో అవి పరిమితంగానే పెట్టుబడుల మార్కెట్లోకి వెళ్లాలి. మరోవైపు ప్రైవేటు బ్యాంకులు క్యాపిటల్ మార్కెట్‌నుంచి పూర్తి పెట్టుబడులు పొందడంతో పాటు మంచి లాభాలను ఆర్జించనున్నాయని ఆయన చెప్పారు. బ్యాంకింగ్ వ్యవస్థ ముందుకు వెళ్లడానికి అయిదు ప్రధానమైన అంశాలు ముఖ్యమని, అవి బలమైన నిర్వహణ సామర్థ్యం, మూలధనం, రిస్క్ తక్కువ ఆస్తులు, నిధులు- లిక్విడిటీ, లాభదాయకత, ప్రభుత్వ మద్దతు అని మూడీస్ ఆ నివేదికలో పేర్కొంది. కాగా, రాబోయే 12 నెలల కాలంలో రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేట్లలో పరిమితమైన కోత ఉండవచ్చని భావిస్తున్నట్లు మూడీస్ తెలిపింది. నికర వడ్డీ రాబడి మార్జిన్లు స్థిరపడడానికి ఇది తోడ్పడుతుందని పేర్కొంది.బ్యాంకింగ్ రంగానికి క్రెడిట్ ఖర్చులు ఎక్కువగానే ఉంటాయని, అయితే మొత్తం మీద పరిశ్రమకు ఇటీవలి సంవత్సరాల్లో ఉన్నదానికన్నా ఈ రిస్క్ ఎక్కువగా ఉండదని ఆ నివేదికలో మూడీస్ పేర్కొంది.