బిజినెస్

సైనిక చర్య అభినందనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: పాకిస్తాన్ దుశ్చర్యలపై భారత సైన్యం ధీటుగా స్పందించడంపట్ల ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా హర్షం వ్యక్తం చేశారు. నియంత్రణ రేఖ వద్ద ఆర్మీ సర్జికల్ దాడులను సమర్థించారు. పాక్ వక్ర బుద్ధికి భారత సాయుధ బలగాలు గుణపాఠం చెప్పాయని కొనియాడారు. ‘పాకిస్తాన్ ఉగ్రవాదుల శిబిరాలపై విజయవంతంగా ప్రతికార దాడులు నిర్వహించిన భారత సైన్యానికి నా హృదయపూర్వక అభినందనలు’. అని శుక్రవారం ట్విట్టర్‌లో టాటా శుభాకాంక్షలు అందజేశారు. ఇండియన్ ఆర్మీ సర్జికల్ దాడులపై గురువారం కూడా భారతీయ పారిశ్రామిక రంగం హర్షం వ్యక్తం చేసింది. బయోకాన్ సిఎండి కిరణ్ మజుందార్ షా, మహీంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్ర సైన్యం ప్రతీకార చర్యలను సమర్థించారు. కశ్మీర్‌లోని ఉరీ వద్దనున్న భారత సైనిక శిబిరంపై పాక్ ప్రేరేపిత ఉక్ర మూకలు దాడి చేసిన 11 రోజుల అనంతరం సైన్యం ఈ సర్జికల్ దాడులను నిర్వహించింది. వీటిలో సుమారు 40 మంది ఉగ్రవాదులు, 10 మంది పాక్ సైనికులు హతమైనట్లు భారత సైనిక వర్గాల ద్వారా తెలుస్తోంది.