బిజినెస్

మెడికల్ క్లస్టర్స్‌కు ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 30: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఎపిఇడిబి), కేంద్ర ప్రభుత్వం నెలకొల్పిన టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డు (టిడిబి)ల మధ్య శుక్రవారం ఎంఒయు కుదిరింది. విశాఖలో శంకుస్థాపన జరిగిన మెడ్‌టెక్ పార్కులో ఏర్పాటు చేయనున్న వివిధ మెడికల్ క్లస్టర్స్ తయారీ కోసమే ఈ ఎంఒయు జరిగింది. శుక్రవారం సాయంత్రం ఒక ప్రైవేట్ హోటల్‌లో కేంద్ర శాస్త్ర, సాంకేతిక సహాయ మంత్రి వై సుజనాచౌదరి, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ల సమక్షంలో విశాఖలోని మెడ్‌టెక్ పార్కుకు సంబంధించిన ఎంఒయుపై టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ బిందు డే, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు సిఇఒ జె కృష్ణకిషోర్‌లు సంతకాలు చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ 1996లో టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దీన్ని దేశంలో ఔత్సాహికులైన పారిశ్రామికవేత్తలను తయారు చేయడానికి నెలకొల్పినట్లు చెప్పారు. దేశంలో ఇప్పటికీ 97 శాతం వైద్య పరికరాలను దిగుమతి చేసుకోవడం జరుగుతోందని, దీన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మెడ్‌టెక్ పార్కుల్లో సాధ్యమైనంత తొందరగా ఉత్పత్తి ప్రారంభించినట్లయితే విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఆర్జించవచ్చని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా దీనికి తగినంత తోడ్పాటును అందిస్తున్నట్లు తెలిపారు. వెంచర్ క్యాపిటల్ చేయడానికి ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు మంచి అవకాశమని అన్నారు. దీనివల్ల రాష్ట్రంలో అనేక పరిశ్రమలు వస్తాయని, దీంతో ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయన్నారు. స్టార్టప్ ఇండియా-స్టాండప్ ఇండియా కార్యక్రమంలో వీటికి మద్దతు ఇవ్వడానికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాయితీలు ఇస్తున్నారని తెలియ జేశారు. ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ మెడికల్ టెక్నాలజీలో అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్యుపెన్సీ రేషియో 28 శాతం పెరిగిందన్నారు. విశాఖ ఎంపి హరిబాబు మాట్లాడుతూ ఇవాళ కేంద్రం, రాష్ట్రం ఈ ఎంఒయుపై సంతకాలు చేయటం ఒక మంచి పరిణామమన్నారు. బహుళజాతి సంస్థలు మెడికల్ స్పేర్ పార్ట్స్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయని, దానివల్ల గ్లూకోమీటర్‌లో వాడే స్ట్రిప్స్ కూడా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. మచిలీపట్నం ఎంపి కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ సాంకేతిక అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరిస్తోందని, దీనివల్ల మెడికల్ డివైస్‌ను తయారుచేయడానికి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ వారు రూ. 250 కోట్లు వెచ్చించారని పేర్కొన్నారు. మెడికల్ అండ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ముఖ్య ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ ఈ మెడ్‌టెక్ పార్కులో ఏర్పాటుచేసే సంస్థలో ఉత్పత్తి ప్రారంభిస్తే తక్కువ ధరల్లోనే మందులను అందుబాటులోకి తీసుకురావచ్చని చెప్పారు.
కేంద్ర టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డు కార్యదర్శి బిందు డే మాట్లాడుతూ మెడికల్ డివైసెస్ మానుఫాక్చరింగ్ క్లస్టర్స్ తయారీకి ఆంధ్రప్రదేశ్ వేదిక కావడం అభినందనీయమన్నారు. ఈ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఎంఒయు కార్యక్రమంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతోపాటు కేంద్ర, రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు.

కేంద్ర సహాయ మంత్రి సుజనాచౌదరి సమక్షంలో ఎంఒయు కుదుర్చుకుంటున్న అధికారులు