బిజినెస్

తగ్గిన యాక్సిస్ బ్యాంక్ లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 25: దేశీయ ప్రముఖ ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఏకంగా 83 శాతం తగ్గింది. మొండి బకాయిల కారణంగా 319 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌లో బ్యాంక్ లాభం 1,915.64 కోట్ల రూపాయలుగా నమోదైంది. అయితే ఆదాయం ఈసారి 13,698.7 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 12,001 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఈ ఏప్రిల్-సెప్టెంబర్ త్రైమాసికంలో బ్యాంక్ లాభం 52 శాతం పడిపోయి 1,875 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు మంగళవారం బ్యాంక్ తెలియజేసింది. కాగా, ఈ జూలై-సెప్టెంబర్‌లో స్థూల నిరర్థక ఆస్తులు 4.17 శాతం, నికర నిరర్థక ఆస్తులు 2.02 శాతం పెరిగాయి. అయితే నికర వడ్డీ ఆదాయం ఈసారి 4,514 కోట్ల రూపాయలుగా, పోయినసారి 4,062 కోట్ల రూపాయలుగా ఉంది.