గుంటూరు

ఆన్‌లైన్ బిల్డింగ్‌ప్లాన్‌పై అధికారులకు శిక్షణపై కమిషనర్‌ను కలిసిన సాఫ్టెక్ నిపుణులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు , డిసెంబర్ 18: భవన నిర్మాణ అనుమతుల కోసం నగరపాలక సంస్థ కార్యాలయం చుట్టూ తిరిగే ప్రయాసను తగ్గిస్తూ నేరుగా ఆన్‌లైన్‌లో ప్లాన్ పొందేందుకు నూతనంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌పై అవగాహన కల్పించేందుకు అధికారులకు శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మి తెలిపారు. శుక్రవారం కమిషనర్ చాంబర్‌లో పూణెకు చెందిన సాఫ్టెక్ కంపెనీ ప్రతినిధులు ఆమెను కలిసి తాము రూపొందించిన సాఫ్ట్‌వేర్ వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా నాగలక్ష్మి మాట్లాడుతూ 19వ తేదీ సాయంత్రం నుండి నగరపాలక సంస్థ కార్యాలయంలో తొలుత నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళికాధికారులకు సాఫ్ట్‌వేర్‌పై తరగతులు నిర్వహించాలని, అనంతరం లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్స్‌కు రోజుకు 20 మందికి చొప్పున శిక్షణ ఇవ్వాలని తెలిపారు. బిల్డింగ్‌ప్లాన్ ఆన్‌లైన్ విధానం అమలు తీరును పరిశీలించేందుకు ప్రభుత్వం గుంటూరు, విజయవాడ, విశాఖపట్నాలను ఫైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని అమలు చేస్తుందని, దీనికి అధికారులు సహకరించాలన్నారు. అలాగే ప్రజలు ఆన్‌లైన్ ద్వారా బిల్డింగ్ ప్లాన్ పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సమావేశంలో సాఫ్టెక్ కంపెనీ నిపుణులు లలిత్ పరమార్, సిటీప్లానర్ ధనుంజయరెడ్డి, డిసిపి సత్యనారాయణ, టిపిఎస్‌లు, బిల్డింగ్ ఇన్స్‌పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.