బిజినెస్

పాస్‌పోర్టు సేవా కేంద్రాలుగా పోస్ట్ఫాసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, నవంబర్ 22: త్వరలో తపాలా కార్యాలయాలు పాస్‌పోర్టు సేవా కేంద్రాలుగా మారనున్నాయని తపాలా శాఖ డైరక్టర్ ఇవిరావు (ఆంధ్రప్రదేశ్ సర్కిల్) చెప్పారు. ఇందుకోసం రాష్ట్రంలోని కడప జిల్లాను పైలెట్ ప్రాజెక్టుకు ఎంపిక చేశామన్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ, తపాలా శాఖ సంయుక్తంగా ఈ పథకంపై కృషి చేస్తున్నాయ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మంగళవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ఇండియా పోస్టు పేమెంట్ బ్యాంకును కూడా ఏర్పాటు చేయనున్నామని, ఇందుకోసం చిత్తూరు జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామన్నారు. ఎపి సర్కిల్‌లో 32 ప్రాంతాల్లో ఈ బ్యాంకింగ్ విధానం అమలు చేస్తామన్న ఆయన పెద్ద నోట్లను రద్దు చేసిన అనంతరం రాష్ట్రంలోని 59 ప్రధాన తపాలా కార్యాలయాలు, 1,525 సబ్ పోస్ట్ఫాసులు, 8,739 బ్రాంచ్ కార్యాలయాల ద్వారా 280.95 కోట్ల రూపాయల పాత కరెన్సీ మార్పిడి జరిగిందన్నారు. 9.36 లక్షల మంది తమ వద్ద ఉన్న 500, 1000 రూపాయల నోట్లను మార్చుకున్నారని చెప్పారు. కాగా, రద్దు నిర్ణయం తర్వాత పోస్ట్ఫాసుల్లో డిపాజిట్లు కూడా బాగా జరిగాయని, నవంబర్ 10 నుంచి 21 వరకు రాష్ట్రంలోని 10 లక్షల 11,533 మంది ఖాతాదారులు 944 కోట్ల 25 లక్షల రూపాయలను డిపాజిట్ చేశారన్నారు. అలాగే 221 కోట్ల 58 లక్షల రూపాయల నగదును 2 లక్షల 51,350 మంది విత్‌డ్రా చేసుకున్నారని వివరించారు. మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన గోల్డ్ బాండ్ పథకం ద్వారా 7,842 మంది 20.76 కిలోల బంగారాన్ని కొనుగోలు చేశారని ప్రకటించారు. కోర్ సిస్టం ఇంటిగ్రేటర్ (సిఎస్‌ఐ) విధానం ద్వారా మెయిల్ నుంచి నగదు వరకు అంతా కంప్యూటరీకరణ చేస్తామన్నారు. ప్రస్తుతం మచిలీపట్నం, తెనాలి, అమలాపురం, కర్నూలు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టులు నడస్తున్నాయని, రూరల్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఆర్‌ఐసిటి) ద్వారా పైలెట్ ప్రాజెక్టులు భీమవరం, రాజమండ్రి, కర్నూలు, కాకినాడ, గుడివాడ, మచిలీపట్నం, తెనాలిలో నడస్తున్నాయన్నారు. దీని ద్వారా మైక్రో ఎటిఎం, నగదు స్కానర్, ఆన్‌లైన్ సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. నిర్ణీతకాలంలో ప్రతీ ఎకౌంట్ ఆన్‌లైన్ అవుతుందన్నారు.