బిజినెస్

ఇక బిగ్ బజార్ స్టోర్లలో నగదు ఉపసంహరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 22: ఇక బిగ్‌బజార్ స్టోర్లలోనూ నగదు ఉపసంహరణలు చేసుకోవచ్చు. ఈ నెల 24 (గురువారం) నుంచి దేశవ్యాప్తంగా 115 నగరాలు, పట్టణాల్లో ఉన్న 258 బిగ్‌బజార్, ఎఫ్‌బిబి స్టోర్లలో డెబిట్, ఎటిఎమ్ కార్డుల ద్వారా బ్యాంక్ ఖాతాదారులు నగదును ఉపసంహరించుకునే అవకాశం లభిస్తోంది. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐతో ఈ మేరకు బిగ్‌బజార్ టైఅప్ అయ్యింది. ఇందులోభాగంగానే బిగ్‌బజార్, ఎఫ్‌బిబి స్టోర్లలో మినీ ఎటిఎమ్‌లు ఏర్పాటవుతున్నాయి. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనకు 500, 1,000 రూపాయల నోట్లను ఈ నెల 8వ తేదీ రాత్రి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు రద్దు చేసినది తెలిసిందే. అయితే 100, కొత్త 500, 2,000 రూపాయల నోట్ల కోసం బ్యాంకులు, ఎటిఎమ్‌ల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. దీంతో ఎస్‌బిఐ సహకారంతో ఇప్పుడు బిగ్‌బజార్ స్టోర్లలోనూ నగదు విత్‌డ్రా సదుపాయం వస్తోంది. మంగళవారం బిగ్‌బజార్ అధినేత కిశోర్ బియాని స్వయంగా ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. గురువారం నుంచి తమ స్టోర్లలో డెబిట్ కార్డు వినియోగం ద్వారా 2,000 రూపాయలను తీసుకోవచ్చని చెప్పారు. క్యాష్ కౌంటర్లలో కార్డు స్వైపింగ్ ద్వారా తమతమ ఖాతాల నుంచి గరిష్ఠంగా 2,000 రూపాయల వరకు అందుకోవచ్చని తెలిపారు.