బిజినెస్

ఇంధన పొదుపునకు ఇక రోడ్లపైకి ఇ-సైకిళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 29: చెన్నైలోని వెల్‌టెక్ విశ్వవిద్యాలయం ఫ్రాన్స్‌లోని ఓ విశ్వవిద్యాలయంతో కలిసి పెట్రో ఉత్పత్తుల పొదుపునకు దశల వారీగా రోడ్లపైకి ఇ-సైకిళ్లను తీసుకురావాలని ఇటీవల నిర్ణయంచింది. దీనికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా కూడా ఊపింది. కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ, ఫ్రెంచ్ విదేశీ వ్యవహారాల మంత్రితో కలిసి ఏర్పాటు చేసిన ఇండో-ఫ్రెంచ్ ఆధునిక పరిశోధన ప్రోత్సాహక కేంద్రం సైతం దీనికి ఆమోదం తెలిపింది. 77 లక్షల రూపాయలను కూడా కేటాయించింది. అయతే మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్‌టెక్ విశ్వవిద్యాలయం తాము రూపొందిస్తున్న ఎలక్ట్రిక్ సైకిల్‌ను ప్రదర్శించింది. ఐదు గంటల పాటు ఛార్జింగ్ పెడితే 60 కిలోమీటర్ల దూరం రాగలదిది. దీనికి ఎల్‌ఇడి విద్యుత్ బల్బును వినియోగించుకోటమేగాక జిపిఎ పరికరాన్ని అమర్చామని, అలాగే బ్లూటూత్ ద్వారా సెల్‌ఫోన్ నుంచి లాకింగ్, అన్‌లాకింగ్ సౌకర్యం ఉంటుందని పరిశోధకులు తెలిపారు. తమ పరిశోధన అనంతరం ఈ సైకిళ్లను భారత్, యూరప్ దేశాల్లో విక్రయించాల్సి ఉందన్నారు. పుణెలోని జోషి ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్, గుర్గావ్‌లోని టర్న్ పాయింట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఈ సైకిల్ నమూనాలను తయారు చేశాయ. వీటి మార్కెటింగ్ బాధ్యత కూడా ఈ సంస్థలదే.

చిత్రం..వెల్‌టెక్ విశ్వవిద్యాలయం రూపొందించిన ఎలక్ట్రిక్ సైకిల్