బిజినెస్

రియల్ ఎస్టేట్‌కు నష్టం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 29: రియల్ ఎస్టేట్ రంగంలో యోగత్యలేని రియల్టర్లపై మాత్రమే పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఉంటుందని, వాస్తవానికి హైదరాబాద్‌లో కేంద్రం నిర్ణయం వల్ల రియల్ ఎస్టేట్ రంగం బలోపేతమవుతుందని కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషనన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) వ్యాఖ్యానిం చింది. క్రెడాయ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ రామిరెడ్డి మంగళవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం నిర్ణయం వల్ల రియల్టీ రంగం ప్రక్షాళన అవుతుందన్నారు. హైదరాబాద్‌లో 95 శాతం మార్కెట్ మధ్యతరగతి గృహ విభాగమేనని, ఈ గృహాల ధరలు సాధారణంగా 25 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల మధ్య ఉంటాయన్నారు. ఈ విభాగంలో కొనుగోలుదారులు ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటారని, వీరి ఆదాయం 25 వేల రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఉంటుందన్నారు. వీరు తమ సేవింగ్స్, బ్యాంక్ రుణాల నుంచి మాత్రమే గృహ రుణ వాయిదాలను చెల్లిస్తుంటారని చెప్పారు. పాత 500, 1,000 రూపాయల నోట్ల రద్దు కారణంగా ప్రభుత్వ పన్ను ఆదాయం పెరగవచ్చన్నారు. తద్వారా పభుత్వం యుద్ధ ప్రాతిపదికన వౌలిక వసతుల ప్రాజెక్టులను చేపట్టడంతో పాటుగా ఆర్థిక వృద్ధిని కూడా సాధించవచ్చన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం తాము చేపట్టదలుచుకున్న అమృత్, 2022 నాటికి అందరికీ ఇల్లు, వంద స్మార్ట్ నగరాలను అభివృద్ధి చేయడం లాంటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తుందన్నారు.
కాగా, హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌లో ప్రస్తుతం ధరలు ఇతర మెట్రోలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయన్నారు. స్పెక్యులేటివ్ ఆపరేటర్ల ప్రభావం ఇక్కడ ఉండదన్నారు. క్రెడాయ్ ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణారావు మాట్లాడుతూ ద్వితీయ మార్కెట్లో ఈ నోట్ల రద్దు ప్రభావం ఉండవచ్చని, అయతే ఆరోగ్యకరమైన సంస్కరణలు రానున్నాయన్నారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న రామిరెడ్డి