బిజినెస్

లాభాల్లోకి టాటా పవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 29: టాటా పవర్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో 336.2 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌లో ఇది 95.8 కోట్ల రూపాయల ఏకీకృత నికర నష్టాలను చవిచూసింది. ఆదాయం ఈసారి 7,208.8 కోట్ల రూపాయలుగా, పోయినసారి 7,666.3 కోట్ల రూపాయలుగా ఉందని మంగళవారం ప్రకటించింది. ఇదిలావుంటే డిసెంబర్ 26న అసాధారణ సమావేశానికి టాటా పవర్ పిలుపునిచ్చింది. సంస్థ బోర్డు నుంచి సైరస్ మిస్ర్తి తొలగింపు కోసమే ఈ సమావేశం.