బిజినెస్

ప్రభుత్వరంగ బ్యాంకుల నష్టం రూ. 18 వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ప్రభుత్వరంగ బ్యాంకుల నష్టాలు గత ఆర్థిక సంవత్సరం (2015-16) 17,993 కోట్ల రూపాయలుగా ఉన్నాయని శుక్రవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ గంగ్వార్ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంగా సమర్పించిన వివరాల ప్రకారం 2015-16లో 28 ప్రభుత్వరంగ బ్యాంకులు 17,993 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశాయి. ఇందులో 14 బ్యాంకులు నష్టాలను నమోదు చేయగా, మిగతా 14 బ్యాంకుల లాభాలు తగ్గుముఖం పట్టాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా నష్టం అత్యధికంగా 6,089 కోట్ల రూపాయలుగా ఉంటే, ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా 5,396 కోట్ల రూపాయలు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 3,974 కోట్ల రూపాయలు, ఐడిబిఐ బ్యాంక్ 3,665 కోట్ల రూపాయలు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ 2,897 కోట్ల రూపాయలు, యూకో బ్యాంక్ 2,799 కోట్ల రూపాయలు, సిండికేట్ బ్యాంక్ 1,643 కోట్ల రూపాయలు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నష్టం 1,418 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. లాభాలు తగ్గిన బ్యాంకుల్లో ఎస్‌బిఐ 9,951 కోట్ల రూపాయలతో ముందుంది. ఆ తర్వాత ఎస్‌బిహెచ్ (రూ. 1,065 కోట్లు), ఎస్‌బిబిజె (రూ. 851 కోట్లు), ఆంధ్రా బ్యాంక్ (రూ. 540 కోట్లు) ఉన్నాయి. దీనంతటికీ కారణం మొండి బకాయిలేనన్నది తెలిసిందే. ఇకపోతే 2015-16లో 19 బ్యాంకులకు 25,000 కోట్ల రూపాయల నిధులను అందించామని, ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మరో 25,000 కోట్ల రూపాయలను ఇస్తున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటికే 13 బ్యాంకులకు 22,915 కోట్ల రూపాయల నిధులను ఇచ్చామని పేర్కొన్నారు. వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాలు కలిపి మరో 20,000 కోట్ల రూపాయలను ఇస్తామని స్పష్టం చేశారు.