బిజినెస్

విడిచిపెట్టేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తమ అక్రమ సంపదను సక్రమంగా మార్చుకోవడానికి అడ్డదారులను తొక్కుతున్నవారిని విడిచిపెట్టేది లేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ‘మనీ లాండరింగ్ కార్యకలాపాలతో ప్రమేయమున్నవారిని, బ్లాక్‌మనీని వైట్‌మనీగా మార్చుకుంటున్నవారిని క్షమించేది లేదు.’ అని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ దిశగా దర్యాప్తు సంస్థలు ఇప్పటికే విచారణలు జరుపుతున్నాయని, అక్రమాలను గుర్తిస్తున్నాయని, మున్ముందు మరింత అవినీతి బట్టబయలవుతుందన్న ఆయన తప్పుచేసిన వారికి శిక్ష తప్పదని స్పష్టం చేశారు. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనకు పాత 500, 1,000 రూపాయల నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినది తెలిసిందే. నవంబర్ 8వ తేదీ రాత్రి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకోగా, కొత్తగా 500, 2,000 రూపాయల నోట్లను చలామణిలోకి తెస్తున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 30 వరకు పాత నోట్లను బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో డిపాజిట్ చేసి, వాటికి సమాన విలువైన కొత్త నోట్లను లేదా 100, 50 ఇతరత్రా చిన్న కరెన్సీలను పొందవచ్చని దేశ ప్రజలకు సూచన చేశారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ ప్రక్రియ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కేంద్రాల్లో కొనసాగుతుందని చెప్పారు. అయితే నోట్ల రద్దు నిర్ణయం మింగుడుపడని అవినీతిపరులు తమ అక్రమ సంపదను మార్చుకునే దారులను అనే్వషిస్తుండటంతో వారిపై కేంద్రం దృష్టి సారించింది. రోజుకు 50 వేల రూపాయలకు మించి, డిసెంబర్ 30లోగా 2.50 లక్షల రూపాయలకుపైబడి సేవింగ్స్ ఖాతాల్లో జమచేస్తే ఐటి వివరణ ఇచ్చుకోవాలని చెప్పిన ప్రభుత్వం.. కరెంట్ ఖాతాలకు ఈ పరిమితిని 12.50 లక్షల రూపాయలుగా ప్రకటించింది. జన్ ధన్ ఖాతాల్లోనూ జరుగుతున్న డిపాజిట్లపై కనే్నసిన సర్కారు.. వాటి లావాదేవీలను నిశితంగా గమనిస్తోంది. అక్రమ లావాదేవీల్లో పాలుపంచుకుంటున్న బ్యాంక్, పోస్ట్ఫాసుల అధికారులపైనా కొరడా ఝళిపిస్తోంది.