బిజినెస్

బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే బ్లాక్‌మనీ.. వైట్‌మనీ అవ్వదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే అక్రమ సంపద.. సక్రమ సంపదైపోదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. బ్యాంకు ఖాతాల్లో జమవుతున్న నల్లధనానికి పన్ను చెల్లించక తప్పదని హెచ్చరించారు. ‘కేవలం బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ద్వారా పన్ను చెల్లించకుండా తప్పించుకోవచ్చని అనుకోవద్దు.’ అన్నారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకుల్లో పెరుగుతున్న డిపాజిట్లపై అడిగిన ప్రశ్నకు జైట్లీ పైవిధంగా బదులిచ్చారు. ఇన్నాళ్లూ పన్నులు చెల్లించకుండా పోగేసిన అక్రమ సంపదను ఇప్పుడు బ్యాంకుల్లో జమచేసి సక్రమ సంపదగా మార్చుకుందామనుకుంటే అది పొరబాటేనని తేల్చిచెప్పారు. అన్ని డిపాజిట్లను ఆదాయ పన్ను శాఖ గమనిస్తోందని స్పష్టం చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వివరాల ప్రకారం నవంబర్ 27 వరకు 8.45 లక్షల కోట్ల రూపాయల విలువైన 500, 1,000 రూపాయల నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయని చెప్పారు. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనకు పాత 500, 1,000 రూపాయల నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినది తెలిసిందే. నవంబర్ 8వ తేదీ రాత్రి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకోగా, కొత్తగా 500, 2,000 రూపాయల నోట్లను చలామణిలోకి తెస్తున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 30 వరకు పాత నోట్లను బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో డిపాజిట్ చేసి, వాటికి సమాన విలువైన కొత్త నోట్లను లేదా 100, 50 ఇతరత్రా చిన్న కరెన్సీలను పొందవచ్చని దేశ ప్రజలకు సూచన చేశారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ ప్రక్రియ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కేంద్రాల్లో కొనసాగుతుందని చెప్పారు. అయితే నోట్ల రద్దు నిర్ణయం మింగుడుపడని అవినీతిపరులు తమ అక్రమ సంపదను మార్చుకునే దారులను అనే్వషిస్తుండటంతో వారిపై కేంద్రం దృష్టి సారించింది. రోజుకు 50 వేల రూపాయలకు మించి, డిసెంబర్ 30లోగా 2.50 లక్షల రూపాయలకుపైబడి సేవింగ్స్ ఖాతాల్లో జమచేస్తే ఐటి వివరణ ఇచ్చుకోవాలని చెప్పిన ప్రభుత్వం.. కరెంట్ ఖాతాలకు ఈ పరిమితిని 12.50 లక్షల రూపాయలుగా ప్రకటించింది. జన్ ధన్ ఖాతాల్లోనూ జరుగుతున్న డిపాజిట్లపై కనే్నసిన సర్కారు.. వాటి లావాదేవీలను నిశితంగా గమనిస్తోంది. అక్రమ లావాదేవీల్లో పాలుపంచుకుంటున్న బ్యాంక్, పోస్ట్ఫాసుల అధికారులపైనా కొరడా ఝళిపిస్తోంది.
జిఎస్‌టిపై కుదరని ఏకాభిప్రాయం
ఇదిలావుంటే జిఎస్‌టి మండలి మరోసారి ఏకాభిప్రాయాన్ని తీసుకురాలేకపోయింది. దేశవ్యాప్తంగా త్వరలో అమలు చేయాలనుకుంటున్న ఈ కొత్త పరోక్ష పన్ను విధానంపై రాష్ట్రాల మధ్య సఖ్యత లేకుండగా, జైట్లీ నేతృత్వంలో సమావేశమైన మండలి శనివారం కూడా ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోయింది. దీంతో ఈ నెల 11, 12 తేదీల్లో మళ్లీ మండలి సమావేశమవనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)ను అమల్లోకి తీసుకురావాలని మోదీ సర్కారు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

చిత్రం..న్యూఢిల్లీలో శనివారం విలేఖరులతో మాట్లాడుతున్న అరుణ్ జైట్లీ