బిజినెస్

పెట్రోల్ బంకుల్లో డిజిటల్ పేమెంట్లే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో డిజిటల్ పేమెంట్ వ్యవస్థను ప్రోత్సహించడంలో భాగంగా దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో క్రెడిట్, డెబిట్ కార్డులనే కాదు.. ఇక ఈ-వాలెట్లు, మొబైల్ వాలెట్లనూ నగదుకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం పాత 500, 1,000 రూపాయల నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినది తెలిసిందే. నవంబర్ 8వ తేదీ రాత్రి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ మేరకు నిర్ణయం తీసుకోగా, దీనివల్ల నగదు కొరత చోటుచేసుకుంది. దీన్ని అధిగమించేందుకు నగదు రహిత లావాదేవీలకు అలవాటుపడాలని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండగా, దానికి పూర్తిస్థాయిలో పెట్రోల్ బంకుల ద్వారా నాంది పలకనున్నారు. డబ్బులతో అవసరం లేకుండా ఎలక్ట్రానిక్ విధానాల ద్వారానే అమ్మకాలు జరిగేలా చూస్తున్నారు. ఇక ఇప్పటికే దేశవ్యాప్తంగా 4,800లకుపైగా పెట్రోల్ బంకుల్లో పాయింట్ ఆఫ్ సేల్ (పిఒఎస్) మెషీన్ల ద్వారా రోజుకు 2,000 రూపాయల నగదును తీసుకునే సౌకర్యం ఉన్నది తెలిసిందే. గడచిన రెండు వారాల్లో 65 కోట్ల రూపాయల వరకు నగదు ఇలా పంపిణీ జరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో క్రెడిట్, డెబిట్ కార్డులతోపాటు ఈ-వాలెట్లు, మొబైల్ వాలెట్ల ద్వారా పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసుకునేలా ఏర్పాట్లు విస్తృతంగా జరుగుతున్నాయి. నవంబర్ 9 నుంచి ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 53,077 పెట్రోల్ బంకుల్లో డిజిటల్ పేమెంట్లపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. మొదటి దశలో పెట్రోల్ బంకులను డిజిటలైజ్ చేస్తున్నామని, రెండో దశలో 18 వేల ఎల్‌పిజి పంపిణీ ఏజెన్సీలను, సిఎన్‌జి బంకులను డిజిటలైజ్ చేస్తామన్నారు.