బిజినెస్

ఏడాది చివరికి రాష్ట్రంలో బిఎస్‌ఎన్‌ఎల్ 4జి సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 7: ఈ ఏడాది చివరికి రాష్ట్రంలో 4జి సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని బిఎస్‌ఎన్‌ఎల్ ఎపి సర్కిల్ సిజిఎం మురళీధర్ తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో తమ సర్కిల్ దాదాపు రూ.160 కోట్ల మేరకు లాభాలను ఆర్జించిందని వెల్లడించారు. రానున్న మూడు నెలల్లో 3జి సేవలను మరింతగా మెరుగుపరిచేందుకు 1450 సెల్ టవర్లు నిర్మించనున్నట్లు చెప్పారు. విశాఖలోని బిఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 4జి సేవల ప్రారంభానికి సంబంధించి ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయన్నారు. పెట్టుబడి, ఆదాయం తదితర అంశాలపై మదింపు జరుగుతోందన్నారు. ప్రభుత్వరంగ సంస్థ కావడంతో దీనిపై నిర్ణయం తీసుకునేందుకు కొంత కసరత్తు జరుగుతోందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ను కలిపి ఎపి టెలికాం సర్కిల్‌గా వ్యవహరిస్తామన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో అంతకుముందు సంవత్సరం కంటే 8 శాతం వృద్ధి సాధించామన్నారు. దాదాపు రూ.160 కోట్ల మేరకు లాభాలు ఆర్జించి దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచామన్నారు. గత ఏడాది దాదాపు 17 లక్షల సెల్ కనెక్షన్ల ఇచ్చామని చెప్పారు. సెల్యూలర్ సేవల్లో 10 శాతం, డేటాలో 5 రెట్ల వృద్ధి సాధించామన్నారు. 3జి సేవల మెరుగుకు 1450 టవర్లను మూడు నెలల్లో నిర్మించనున్నామని, ఫేజ్-8 కింద మరిన్ని టవర్లను నిర్మించేందుకు ప్రతిపాదిస్తున్నట్లు వివరించారు. వైఫై సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పిజిఎం ఆర్‌ఎంఎం కృష్ణ, సీనియర్ జిఎం నళినీవర్మ పాల్గొన్నారు.