బిజినెస్

ఆసియాలోని ప్రభావశీలమహిళల్లో నీతా అంబానీకి అగ్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 7: ఆసియాలో ఈ ఏడాది అత్యంత ప్రభావశీరురైన 50 మహిళా పారిశ్రామికవేత్తలతో ప్రముఖ పత్రిక ‘్ఫర్బ్స్’ తాజాగా విడుదల చేసిన జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ నీతా అంబానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) చైర్మన్ అరుంధతీ భట్టాచార్య తొలి రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు. ఈ జాబితాలో నీతా అంబానీ, అరుంధతీ భట్టాచార్య సహా భారత్‌కు చెందిన ఎనిమిది మంది మహిళా పారిశ్రామికవేత్తలకు చోటు లభించింది. వీరిలో బ్యాంకింగ్, బయోటెక్, డేటా ఎనలిటిక్స్, టెక్స్‌టైల్స్, ఫార్మా, వెల్‌నెస్ అండ్ బ్యూటీ తదితర రంగాలకు చెందిన వారు ఉన్నారు. ఎంతో మంది శ్రీమంతుల భార్యలు తమ భర్తల నీడనే ముందుకు సాగుతున్న భారత్ లాంటి దేశంలో నీతా అంబానీ పారిశ్రామికవేత్తగా ఎదిగి ‘రిలయన్స్ ఇండస్ట్రీస్ సామ్రా జ్యం’లో ప్రముఖ స్థానానికి చేరుకోవడం సాధారణమైన విషయమేమీ కాదని, అందుకే ఆమె ఈ ఏడాది ఆసియాలోని అత్యంత ప్రభావశీరురైన మహిళా పారిశ్రామికవేత్తల జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగలిగారని ‘్ఫర్బ్స్’ స్పష్టం చేసింది. మన దేశంలో ‘్ఫర్బ్స్’ పత్రికను ముద్రించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థే లైసెన్సును పొంది ఉండటం గమనార్హం. రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూపులో నీతా అంబానీ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నప్పటికీ భర్త ముఖేష్ అంబానీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుడంతో ఆ గ్రూపు సంస్థల కార్యకలాపాల్లో ఆమె చెప్పుకోదగ్గ పాత్ర పోషించడం లేదు. అయినప్పటికీ ఆ గ్రూపు సంస్థల్లోని ముఖ్యులందరూ నీతా అంబానీని ‘వదిన’గా సంబోధించడమే కాకుండా ముఖేష్ అంబానీతో సరిసమానంగా ఆమెనూ గౌరవిస్తున్నారన్నది బహిరంగ రహస్యమే.