బిజినెస్

వచ్చే ఏడాది 10 శాతం వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: ఈ ఏడాదితో పోలిస్తే 2017లో ఉద్యోగుల జీతాలు తక్కువగా పెరగవచ్చని ఓ నివేదిక అంచనా వేసింది. ఈ ఏడాది ఉద్యోగుల వేతనాలు 10.3 శాతం పెరగ్గా, వచ్చే ఏడాది సగటున పది శాతం మేర మాత్రమే పెరగవచ్చని, ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకుంటే ఈ పెరుగుదల 4.8 శాతమే ఉంటుందని ఆ నివేదిక పేర్కొంది. ఉద్యోగుల వేతనాల పెరుగుదల 10శాతం మేర ఉంటుందని, అయితే వాస్తవానికి వేతనాల పెరుగుదల కేవలం 4.8 శాతంగానే ఉంటుందని కోమ్ ఫెర్రీ హే గ్రూపు 2017 సంవత్సరానికి వేతనాల పెరుగుదలపై రూపొందించిన అంచనా నివేదిక తెలిపింది. ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో వేతనాల పెరుగుదల ఇప్పటికీ ఎక్కువగానే ఉంటుందని, అయితే మొత్తంమీద వేతనాల పెరుగుదల స్థిరీకరించాయని, రాబోయే రెండేళ్లలో 9.5-10.5 శాతం మధ్య ఉంటుందని కోమ్ ఫెర్రీ హే గ్రూపు కంట్రీ మేనేజర్ అమర్ హలీమ్ తెలిపారు. కింది స్థాయి ఉద్యోగుల వేతనాల పెరుగదల ఎక్కువగా ఉండవచ్చని, ఆసియా దేశాలతో సహా మిగతా దేశాలతో పోలిస్తే ఈ స్థాయి ఉద్యోగుల వేతనాలు దేశంలో చాలా తక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు.కాగా, ఆసియాలో వేతనాల పెరుగుదల 6.1 శాతం మేర ఉండొచ్చని, గత ఏడాదితో పోలిస్తే ఇది 0.3 శాతం తక్కువని, అయితే వాస్తవ పెరుగుదల 4.3 శాతం ఉండవచ్చని కూడా ఆ నివేదిక తెలిపింది. వియత్నాం, థాయిలాండ్, ఇండోనేసియాలలో వాస్తవ వేతనాల పెరుగుదల అధికంగా ఉండవచ్చని కూడా ఆ నివేదిక తెలిపింది. ద్రవ్యోల్బణాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా సగటున ఉద్యోగుల వేతనాల పెరుగుదల 2.3 శాతం మేర ఉండవచ్చని, గత ఏడాది అంచనా 2.7 శాతంతో పోలిస్తే ఇది కాస్త తక్కువ అని ఆ నివేదిక తెలిపింది.