బిజినెస్

చెన్నై-రాజమండ్రి మధ్య రోజూ విమాన సర్వీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 8: ప్రయాణికులకు చౌకధరలో విమానయాన సేవలను అందిస్తున్న ‘స్పైస్‌జెట్’ విమానయాన సంస్థ తమ కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి చెన్నై-రాజమండ్రి మార్గంలో ప్రతి రోజూ నేరుగా విమానాలను నడపనుంది. దీంతో తాము ప్రతి రోజూ రాజమండ్రికి నేరుగా విమానాలను నడుపుతున్న మెట్రో నగరాల్లో హైరరాబాద్ తర్వాత చెన్నై రెండవ నగరం అవుతుందని స్పైస్‌జెట్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. చెన్నై-రాజమండ్రి మార్గంలో తాము ఒకవైపు ప్రయాణానికి వసూలు చేసే చార్జీ అన్ని పన్నులూ కలిపి 2,499 రూపాయల నుంచి ప్రారంభమవుతుందని, ప్రతి రోజూ చెన్నైలో మధ్యాహ్నం 1 గంట 10 నిమిషాలకు బయలుదేరే ఈ విమానం మధ్యాహ్నం 2.30 గంటలకు రాజమండ్రి చేరుకుంటుందని, తిరుగు ప్రయాణంలో రాజమండ్రి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరే ఈ విమానం సాయంత్రం 4.15 గంటలకు చెన్నై చేరుకుంటుందని స్పైస్‌జెట్ వివరించింది. ప్రస్తుతం ఈ సంస్థ 119 మార్గాలను కవర్‌చేస్తూ ప్రతి రోజూ 45 గమ్యస్థానాలకు సగటున 340 సర్వీసులను నడుపుతోంది. వీటిలో దేశీయ గమ్యస్థానాలు 39, అంతర్జాతీయ గమ్యస్థానాలు 6 ఉన్నాయి.