బిజినెస్

ప్రీపెయిడ్ ఖాతాదార్లకు రెండు కొత్త ఆఫర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: దేశీయ టెలికామ్ మార్కెట్లో వాణిజ్య పరంగా సేవలను ప్రారంభించకముందే పెను సంచలనాలు సృష్టిస్టున్న రిలయన్స్ జియో ధాటికి మిగిలిన ఆపరేటర్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం తమ ఖాతాదారులకు ఉచితంగా అందజేస్తున్న సేవలను మరో మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్లు రిలయన్స్ జియో కొద్ది రోజుల క్రితం మరో సంచలన ప్రకటన చేసిన విషయం విదితమే. దీంతో జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు దిగ్గజ టెలికామ్ సంస్థ భారతీ ఎయిర్‌టెల్ తమ ప్రీపెయిడ్ ఖాతాదారులకు రూ.145, రూ.345 ధరలతో రెండు సరికొత్త ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గురువారం ప్రకటించింది. వీటిలో 145 రూపాయల ప్యాకేజీ కింద 300 మెగాబైట్ల 4జి డేటాతో పాటు ఎయిర్‌టెల్ నుంచి ఎయిర్‌టెల్‌కు అపరిమితంగా లోకల్/ఎస్‌టిడి కాల్స్‌ను, 345 రూపాయల ప్యాకేజీ కింద 1 గిగాబైట్ 4జి డేటాతో పాటు దేశంలో ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమితంగా లోకల్/ఎస్‌టిడి కాల్స్‌ను అందజేయడం జరుగుతుందని, ఈ రెండు ప్యాకేజీలు 28 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటాయని ఎయిర్‌టెల్ వివరించింది.
దేశంలో నాలుగో తరం (4జి) మొబైల్ సేవలను ప్రారంభించిన తొలి మూడు నెలల్లోనే 5.2 కోట్ల మంది ఖాతాదారులను సంపాదించుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) అధినేత ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇప్పటివరకూ తమ ఖాతాదారులకు ఉచితంగా అందిస్తున్న వాయిస్ కాల్స్, డేటా సేవలను వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రకటించిన విషయం విదితమే. 2017 మార్చి 31వ తేదీ తర్వాత కూడా తమ 4జి ఖాతాదారులకు దేశీయ వాయిస్ కాల్స్‌ను జీవిత కాలం పాటు ఉచితంగా అందజేయనున్నట్లు రిలయన్స్ జియో గతంలోనే స్పష్టం చేసింది. దీంతో రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న తీవ్రమైన పోటీని తట్టుకుని తమ ఖాతాదారులను నిలబెట్టుకునేందుకు ఇతర టెలికామ్ సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను అనే్వషిస్తున్నాయి. ఈ ప్రత్యామ్నాయాల్లో భాగంగానే ఎయిర్‌టెల్ తమ ప్రీపెయిడ్ ఖాతాదారులకు పై ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది.