బిజినెస్

ఉత్తుత్తి విరాళాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 9: ఆంధ్రా విశ్వవిద్యాలయం మహామహులు పట్టాలు పుచ్చుకున్నది ఇక్కడే. ఇక్కడ చదివిన ప్రముఖులు దేశ, విదేశాల్లో అత్యున్నత పదవుల్లో ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ సహకారం లేక ఆర్థికంగా తవ్ర ఇబ్బందుల్లో ఉన్న విశ్వవిద్యాలయాన్ని ఉద్ధరించాలంటే ఉన్నత స్థానాల్లో ఉన్న పూర్వ విద్యార్థుల సహకారం కోరాలని నిర్ణయించారు. విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు కెసి రెడ్డి జయంతిని పురస్కరించుకుని యేటా డిసెంబర్ 10న పూర్వ విద్యార్థుల సమ్మేళనం (అలూమినా) నిర్వహించాలని తీర్మానించారు. దీనిలో భాగంగానే నిరుడు కాస్త ముందుగా నవంబర్ 12న పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. తొలి సమ్మేళనంలో ఎయు పూర్వ విద్యార్థి, ప్రస్తుత కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు సహా దేశ, విదేశాల్లోని ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. విద్యార్థి దశలో తమ అనుభవాలను మననం చేసుకోవడంతోపాటు ఎయు భవిష్యత్ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించేందుకు స్వచ్ఛందంగానే ముందుకు వచ్చారు. దీంతో ఎయు అధికారులు, హాజరైన వారి ఆనందానికి అవధుల్లేవు. సభా ముఖంగా ఎయు పూర్వ విద్యార్థులు తొలి సమ్మేళనంలో 13.88 కోట్ల రూపాయల మేర విరాళాలు ప్రకటించారు. వీరిలో ప్రముఖంగా చెప్పుకోవాలంటే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కోటి విరాళమిచ్చారు. వ్యక్తిగతంగా కాకపోయినప్పటికీ తనకున్న పరిచయాలు, అవకాశాల మేరకు ఈ మొత్తాన్ని ఎయుకి సమకూరే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న గంటా శ్రీనివాసరావు, తన మిత్రుడు మల్లిక్‌తో కలిసి మరో కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు. అలాగూ ఒకప్పటి ఎయు విద్యార్థి, ప్రఖ్యాత వ్యాపారవేత్త గ్రంధి మల్లిఖార్జున రావు (జిఎంఆర్ సంస్థ అధినేత) కోటి రూపాయలు, బిజెపి ఎంపి గోకరాజు గంగరాజు 50 లక్షల రూపాయలు, బిజెపి విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు 25 లక్షల రూపాయల మేర విరాళాలుగా ప్రకటించారు. వీరితోపాటు ఎయు పూర్వ విద్యార్థులు పలువురు కూడా లక్షల్లోనే విరాళాలు ప్రకటించారు. మొత్తంగా 13.88 కోట్ల రూపాయలకు హామీలు లభించాయి. అప్పటి సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన విరాళాల మొత్తానికి ప్రభుత్వం నుంచి మరో 13.88 కోట్ల రూపా యలు ఇచ్చేందుకు హామీ ఇచ్చారు. ఇంకేముంది తొలి విద్యార్థుల సమ్మేళనంలోనే సుమారు 28 కోట్ల రూపా యలు విరాళాలుగా సమకూరడంతో ఎయు వర్గాలు సంబరపడ్డాయ. ఇక్కడ వరకూ ఇది చెప్పుకోడానికి ఎంతో బాగుంది. తీరా వాస్తవంలోకి వచ్చేసరికి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. విద్యార్థుల సమ్మేళనంలో ప్రకటించిన విరాళాల్లో కేవలం ఒకరిద్దరు మాత్రమే మాట నిలబెట్టుకున్నారు. జిఎంఆర్ సంస్థ ఇప్పటికే రూ. 30 లక్షలు కేటాయించి అలూమినా కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటివరకూ కమిటీ వ్యవహారాలు, కార్యాలయం నిర్వహణ ఈ సంస్థ చూస్తోంది. ఇక విశాఖ ఎంపి కంభంపాటి హరిబాబు ప్రకటించిన విరాళం లక్ష రూపాయలు చెల్లించారు. మిగిలిన వారిలో అతికొద్దిమంది మాత్రం ప్రకటించినట్టుగా విరాళాలు చెల్లించి మాట నిలుపుకున్నారు. తాజాగా రెండో సంవత్సరం ఎయు పూర్వ విద్యద్యార్థుల సమ్మేళనం ఈ నెల 17న నిర్వహించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర అతిథుల రాక కోసం అలూమినా తేదీని మార్చాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా, ఎయు అలూమినా నిర్వహణకు అధికార వర్గాలు విస్తృత ఏర్పాట్లే చేస్తున్నాయ. ఇప్పటికే ఎయులో అన్ని భవనాలను విద్యుద్దీపాలతో అలకరించారు. ఈసారి వేడుకలకు కోట్ల రూపాయ ల్లోనే ఖర్చు చేయనున్నారు. అయతే ఒక్క రూపాయి విరాళంగా అందలేదు కానీ ఖర్చులు మాత్రం తడిసిమోపెడవుతున్నాయని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.