బిజినెస్

సరిహద్దు స్మగ్లింగ్‌పై డిఆర్‌ఐ కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 9: సరిహద్దుల ద్వారా దేశంలోకి అక్రమ రవాణా అవుతున్న బంగారం, సిగరెట్లు, యంత్రాల విడిభాగాలు, పట్టు, నూలు, ఎలక్ట్రానిక్ వస్తువులను నిరోధించేందుకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) పటిష్టమైన ప్రణాళికతో పనిచేస్తోందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి హేమ పాండే అన్నారు. సరిహద్దుల ద్వారా అక్రమ రవాణా అవుతున్న వస్తువులపై ఫిక్కీ ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ గత 2015-16 ఆర్థిక సంవత్సరంలో 162 కోట్ల రూపాయల విదేశీ సిగరెట్లు, 41.78 కోట్ల రూపాయల పట్టు, నూలు, 1,119.11 కోట్ల రూపాయల బంగారం, 447.1 కోట్ల రూపాయల యంత్రాల విడిభాగాలు, 17.98 కోట్ల రూపాయల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను డిఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారన్నారు. 2014-15తో పోల్చితే నిరుడు స్వాధీనం విలువలు సిగరెట్లలో 78.5 శాతం, పట్టు, నూలులో 73.8 శాతం, బంగారంలో 61.6 శాతం పెరిగిందన్నారు. భారతీయ పరిశ్రమ, ఆర్థిక వ్యవస్థకు సరిహద్దు స్మగ్లింగ్ పెద్ద సవాలుగా తయారైందని, జాతీయ ప్రయోజనాలకు స్మగ్లింగ్ విఘాతం కలిగిస్తోందన్నారు.
వినియోగదారులు, దర్యాప్తు సంస్థలు, పరిశ్రమలు, రవాణా అన్ని కలిపి పనిచేస్తేనే స్మగ్లింగ్‌ను అరికట్టగలమన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్, కస్టమ్స్ చైర్మన్ నజీబ్‌షా, ఫిక్కీ చైర్మన్ అనిల్ రాజ్‌పుత్, అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ అరుణ్ చావ్లా ప్రసంగించారు.