బిజినెస్

పడకేసిన పారిశ్రామికోత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: పారిశ్రామికోత్పత్తి (ఐఐపి) పడకేసింది. అక్టోబర్‌లో మైనస్ 1.9 శాతానికి క్షీణించింది. పడిపోయిన క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి, పేలవమైన తయారీరంగ ప్రదర్శన కారణంగా మళ్లీ ఐఐపి గణాంకాలు రుణాత్మకంగానే నమోదయ్యాయి. ఐఐపిలో తయారీ రంగం వాటానే 75 శాతానికిపైగా ఉంటుంది. ఇక అంతకుముందు సెప్టెంబర్‌లో 0.7 శాతంతో కాస్త కోలుకున్న సంకేతాలు కనిపించగా, జూలై (-2.5 శాతం), ఆగస్టు (-0.7 శాతం)ల్లో రుణాత్మకంగానే ముగిశాయి. ఇదిలావుంటే ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-అక్టోబర్ మధ్య ఐఐపి ప్రగతి 0.3 శాతానికి పతనమైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఇదే వ్యవధిలో 4.8 శాతం వృద్ధిరేటు నమోదైందని శుక్రవారం కేంద్ర గణాంకాల కార్యాలయం (సిఎస్‌ఒ) తెలిపింది.