బిజినెస్

బిఎస్‌ఎన్‌ఎల్ నష్టం రూ. 1,721 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ నష్టాలు ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 1,721 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. ఈ మేరకు శుక్రవారం సమాచార శాఖ మంత్రి మనోజ్ సిన్హా రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు. ఆదాయం 7,331 కోట్ల రూపాయలుగా ఉందన్నారు. కాగా, 2013-14 ఆర్థిక సంవత్సరంలో సంస్థ నష్టం 7,019 కోట్ల రూపాయలుగా, 2014-15 ఆర్థిక సంవత్సరంలో 8,234 కోట్ల రూపాయలుగా ఉందన్నారు. అయితే 2015-16 ఆర్థిక సంవత్సరంలో నష్టం 3,880 కోట్ల రూపాయలకు తగ్గిందని చెప్పారు.