బిజినెస్

నాబార్డు వ్యాపారం రూ.7,720 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 7: ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఆర్ధిక సంవత్సరానికి రూ.7,720.64 కోట్ల వ్యాపారం చేసినట్లు నాబార్డు తెలంగాణ రాష్ట్ర ప్రాంతీయ కార్యాలయం తెలిపింది. దీనిలో ధీర్ఘకాలిక పెట్టుబడి రుణాల రీ ఫైనాన్స్‌కు రూ.3630.64 కోట్లు, పంటల ఉత్పాదన, మార్కెటింగ్, ఇతర అవసరాలకు గాను స్వల్పకాలిక రీఫైనాన్స్ కింద రూ2479 కోట్లు అందించినట్లు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే వౌళికసదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు అందించే రుణాలకు గాను రూ.900 కోట్లు మంజూరు చేయాల్సి ఉండగా, రూ.913.71 కోట్లు మంజూరు చేసినట్లు నాబార్డు కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. గిడ్డంగుల వౌళిక సదుపాయల నిధికి రూ.972 కోట్లను 17 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలలను ఉంచుకునేందుకు వీలుగా 330 గిడ్డంగులను నిర్మించేందుకు మంజూరు చేసినట్లు తెలిపింది. ఇంకా గిరిజన, వాటర్‌షెడ్లు, మైక్రో ఎంట్రెప్రెన్యూర్స్ వంటి వాటి అభివృద్ధి కోసం వివిధ రూపాల్లో రూ.281.15 కోట్లు ఆర్ధిక సహాయంగా అందించినట్లు నాబార్డు వెల్లడించింది.