బిజినెస్

ఏప్రిల్ 1 నుంచి జిఎస్‌టి అమలయ్యేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: వచ్చే సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలయ్యేనా? అన్న అనుమానాలు కలుగుతున్నాయ. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో ఆదివారం ఇక్కడ జరిగిన 6వ జిఎస్‌టి మండలి సమావేశంలోనూ సంతృప్తికర నిర్ణయాలు వెలువడలేదుమరి. జిఎస్‌టి చట్టాల లెజిస్లేటివ్ ముసాయిదాపై చర్చ మొదలవగా, జిఎస్‌టి నిబంధనలకు సంబంధించి చాలావరకు స్పష్టత లభించింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కీలక అంశాలపై బేధాభిప్రాయాలు కొనసాగడంతో తాజా సమావేశమూ అర్ధాంతరంగానే ముగిసింది. వచ్చే మండలి సమావేశంలో జిఎస్‌టి డ్రాఫ్ట్ లెజిస్లేషన్ ఆమోదం పొందగలదన్న ఆశాభావాన్ని జైట్లీ వ్యక్తం చేశారు. మరోవైపు సోమవారం జరగాల్సిన జిఎస్‌టి మండలి సమావేశం వాయిదా పడింది. మిలాదున్ నబీ సందర్భంగా సెలవు కావడంతో తదుపరి సమావేశాలను ఈ నెల 22-23 తేదీల్లో జరపనున్నట్లు జైట్లీ చెప్పారు.

చిత్రం..ఆదివారం జైట్లీ నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన జిఎస్‌టి మండలి సమావేశం