బిజినెస్

ఆస్తులు వెల్లడించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: బ్యాంకులకు తొమ్మిదివేల కోట్ల రూపాయలు ఎగవేసిన లిక్కర్ వ్యాపారి విజయ్‌మాల్యా ఆస్తుల వివరాలు ఈనెల 21లోగా వెల్లడించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. చర, స్థిరాస్తులతో పాటు అన్ని రకాల ఆస్తులు తమ ముందు ఉంచాలని జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ రొహింగ్టన్ ఫాలీ నారిమన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. మాల్యా భార్య, పిల్లల పేర్లతో ఉన్న ఆస్తులు వెల్లడించాలని బెంచ్ తెలిపింది. బ్యాంకులకు నాలువేల కోట్ల రూపాయలు చెల్లించడానికి సంసిద్ధత వ్యక్తం చేసిన విజయ్ మాల్యా భారత్‌కు ఎప్పుడు తిరిగి వస్తారో తెలపాలని సూచించింది.‘మాల్యా భారత్‌కు ఎప్పుడు తిరిగి వచ్చేదీ, వ్యక్తిగతంగా కోర్టుకు ఏ తేదీన హాజరయ్యేది స్పష్టం చేయండి‘అని లిక్కర్ కింగ్ తరఫున్యాయవాది సిఎస్ వైద్యనాథన్‌ను ధర్మాసనం ఆదేశించింది. ఏప్రిల్ 21 నాటికి ఆస్తుల వివాలన్నీ తమ ముందు ఉంచాలన్న సుప్రీం కోర్టు‘స్వదేశం, విదేశాల్లో ఉన్న చర, స్థిర ఆస్తులకు సంబంధించి ఓ అఫిడవిట్ దాఖలు చేయండి’అని స్పష్టం చేసింది. తీసుకున్న రుణం కింద నాలుగువేల రూపాయలు బ్యాంకులకు చెల్లించడానికి తన క్లయింట్ సిద్ధంగా ఉన్నారని వైద్యనాథన్ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. అయితే మాల్యా ప్రతిపాదనను బ్యాంకులు తిరస్కరించాయి. సిబిఐ సారధ్యంలోని 13 బ్యాంకుల కన్‌సార్టియం ఈమేరకు సుప్రీం కోర్టుకు తమ అభిప్రాయం తెలిపాయి. అసలు మాల్యా స్వదేశానికి ఎప్పుడు తిరిగి వస్తారో స్పష్టం చేయాలని ధర్మాసనం ఆదేశించింది. బ్యాంకుల తరఫున సీనియర్ న్యాయవాది ఎస్‌ఎస్ నాగానంద్ తన వాదనలు వినిపించారు. మాల్యాకు సంబంధించి ఆస్తుల వివరాలన్నీ వెల్లడైతే అప్పుడు సంప్రదింపుల ద్వారా ఓ పరిష్కారం చూడొచ్చని కన్‌సార్టియం తరఫున్యాయవాది శ్యామ్ దివాన్ కోర్టుకు తెలిపారు. కింగ్ ఫిషర్ యజమానికి ఎస్‌బిఐతోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, యాక్సిస్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, జమ్మూకాశ్మీర్ బ్యాంకు, ఐడిబిఐ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు రుణాలు అందజేశాయి. ఈకేసు తదుపరి విచారణను సుప్రీం కోర్టు ఈ నెల 26కు వాయిదా వేసింది.