బిజినెస్

జిసిసి బ్రాండ్‌తో ‘సమ్మర్ డ్రింక్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 13: చల్లదనాన్ని, ప్రత్యేక అనుభూతిని కలిగించే జిసిసి శీతల పానీయం మార్కెట్‌లోకి రాబోతోంది. వచ్చే వేసవిలో దీన్ని పరిచయం చేయాలని గిరిజన సహకార సంస్థ (జిసిసి) నిర్ణయించింది. నన్నారి, బిల్వతో తయారు చేసిన ఈ శీతల పానీయాన్ని టెట్రా ప్యాక్ తరహాలో అందుబాటులోకి తీసుకురానుంది. సామాన్య వినియోగదారులు లక్ష్యంగా తక్కువ ధరతో దీన్ని విడుదల చేస్తున్నారు. ఫ్రూటీ ప్యాకెట్ల తరహాలో చౌక ధరకు తీసుకురావడం ద్వారా మరింత ఆదరణ లభిస్తుందని జిసిసి భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటి నుంచే టెట్రా ప్యాకెట్ల తయారీపై దృష్టి పెట్టింది. ఇందులో ఎంత మేర నన్నారి, బిల్వ రసాన్ని ఉంచాలి? ఎంత ధరకు విక్రయించాలి? రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు డిమాండ్‌నుబట్టి ఇతర రాష్ట్రాల్లోనూ డిస్ట్రిబ్యూటర్లను నియమించడం ద్వారా ఈ శీతల పానీయాన్ని మార్కెట్‌లోకి తీసుకువస్తే ఏ విధంగా ఉంటుంది? అనే అంశాలపై ఇపుడు జిసిసి యాజమాన్యం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులోభాగంగా జిసిసి వైస్-చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎఎస్‌పిఎస్ రవి ప్రకాష్ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎండల తీవ్రతనుబట్టి మార్చి నుంచి నన్నారి, బిల్వతో కూడిన ఈ శీతల పానీయం టెట్రా ప్యాక్‌లను మార్కెట్‌లోకి విడుదల చేస్తే వినియోగదారుల నుంచి ఆదరణ లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మార్కెట్ ఆదరణనుబట్టి ఎక్కువ శాతం మేర వీటిని మార్కెట్‌లో విక్రయించేందుకు వీలుగా డిస్ట్రిబ్యూటర్లు, ఏజెన్సీలను నియమించాలని కూడా ఆలోచన చేస్తున్నారు. ఒక ప్యాకెట్ కనీసం పది రూపాయలు ఉండేలా ధర నిర్ణయిస్తారు. అలాగే నిరుడు మాదిరి అర లీటరు, లీటర్ సీసాలతోనే వీటిని విక్రయించాలన్న ఆలోచన కూడా చేస్తోంది. కాగా, ఈ సంవత్సరం వేసవి సీజన్‌లో నన్నారి, బిల్వ రసాన్ని ప్రత్యేక సీసాలతో జిసిసి అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే వేసవి సీజన్‌కే ఇది పరిమితమైంది. వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభించినప్పటికీ ఆ తరువాత కనిపించనే లేదు. అయతే వచ్చే వేసవి నుంచైనా పూర్తి స్థాయలో పానియాలను అందుబాటులో ఉంచాలని జిసిసిని పలువురు వినియోగదారులు కోరుతున్నారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఇలాంటి సహజసిద్ధమైన, ప్రకృతిసిద్ధమైన పానియాలు మార్కెట్‌లోకి మరిన్ని రావాలని అంటున్నారు. ఆ దిశగా జిసిసి అడుగులు వేయాలని, దీనికి ప్రభుత్వ సహకారం, ప్రోత్సాహం కూడా ఉంటే బాగుంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.