బిజినెస్

ఢిల్లీ విమానాశ్రయంలో ఈ-షాపింగ్ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: ఢిల్లీ విమానాశ్రయంలో ఈ-షాపింగ్ సేవ ఏర్పాటు చేసినట్టు జిఎంఆర్ గ్రూప్ ప్రకటించింది. ఇక నుంచి దేశీయ ప్రయాణికులు తమకు కావాల్సిన వస్తువులను ముందుగానే అన్‌లైన్‌లో అర్డర్ చేసుకొనే అవకాశం దీనిద్వారా కల్పిస్తున్నట్టు జిఎంఆర్ గ్రూప్ తెలిపింది. అన్‌లైన్ షాపింగ్ పోర్టల్ ద్వారా ఇప్పటి నుంచి మెడిసిన్, ఆహారం, వస్త్రాలతోపాటు వివిధ వస్తువులను ప్రయాణికులు పొందవచ్చని ఒక ప్రకటనలో తెలిపింది. అర్డర్ చేసిన వస్తువులకు ప్రయాణికులు నగదు లేదా క్రెడిట్ కార్డు ద్వారా ఆయా కేంద్రాలలో చెల్లింపులు చేసుకోవచ్చునని చెప్పింది. ఢిల్లీ విమానాశ్రయ జిఎంఆర్ గ్రూప్ సీఈఓ ప్రభాకరరావు మాట్లాడుతూ డిజిటల్ ఇండియాలో భాగంగా ఈ-షాపింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు.