బిజినెస్

దేశ జిడిపి అంచనాను తగ్గించిన ఎడిబి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: ఈ ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను దేశ జిడిపి వృద్ధిరేటును ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) తగ్గించిన నేపథ్యంలో ఇప్పుడు ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఎడిబి) కూడా తగ్గించింది. ఇంతకుముందు 7.6 శాతంగా నమోదు కాగలదన్న ఆర్‌బిఐ.. ఇప్పుడు 7.1 శాతానికే పరిమితమవగా, గతంలో 7.8 శాతంగా ఉండొచ్చన్న ఎడిబి.. ప్రస్తుతం 7 శాతంగానే ఉంటుందని అంచనా వేసింది. ఇక పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఈ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో భారత జిడిపి వృద్ధిరేటు 5.5-6 శాతంగానే ఉంటుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ అభిప్రాయపడింది. ఇప్పటికే పలు దేశ, విదేశీ రేటింగ్ ఏజెన్సీలు భారత జిడిపి వృద్ధిరేటు అంచనాల్ని తగ్గించినది తెలిసిందే. నోట్ల రద్దుతో పడిపోయిన వ్యాపార, పారిశ్రామిక లావాదేవీలే దీనికి కారణం.