బిజినెస్

కార్పొరేట్ ఫలితాల భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 7: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న రిస్క్‌లను అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రధానంగా ఎత్తిచూపిన నేపథ్యంలో విదేశీ మార్కెట్లు నష్టాల బాటలో సాగడంతో పాటుగా, నాలుగో త్రైమాసిక కార్పొరేట్ ఫలితాలపై అంచనాలు సైతం మారిపోతున్న దృష్ట్యా మదుపరులు తమ వద్ద ఉన్న స్టాక్స్‌ను వదిలించుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడంతో గురువారం బిఎస్‌ఇ సెనె్సక్స్ 215 పాయింట్లు నష్టపోయి మూడు వారాల కనిష్టస్థాయికి పడిపోయింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం దాదాపు 68 పాయింట్లు నష్టపోయి 7,600 పాయింట్ల దిగువకు చేరుకుంది. విదేశీ ఆర్థిక వ్యవస్థలు, అమెరికా మార్కెట్లు సైతం ఒడిదుడుకుల్లో ఉన్న కారణంగా భవిష్యత్తులో వడ్డీరేటు పెంపుపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని అమెరికా ఫెడరల్ రిజర్వ్ స్పష్టం చేసినప్పటికీ మార్కెట్లు మాత్రం గాడి తప్పుతున్నాయని జియోజిత్ పిఎన్‌బి పరిబాస్‌లో రిసెర్చ్ విభాగం చీఫ్ వినోద్ నాయర్ అభిప్రాయ పడ్డారు. నాలుగో త్రైమాసిక ఫలితాలపై అంచనాలు పెద్దగా లేని నేపథ్యంలో విదేశీ పెట్టుబడిదారులు స్వల్ప మొత్తాల్లో మార్కెట్‌నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. ఇదిలా ఉండగా, రూపాయి పెద్దగా పతనమై ప్రమాదాలు ఏవీ కనిపించడం లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం స్పష్టం చేశారు.
కాగా, డాలరుతో జపాన్ యెన్ బలపడిన నేపథ్యంలో గురువారం మారుతి సుజుకి షేరు 3.44 శాతం పడిపోయింది. మరోవైపు బిహెచ్‌ఇఎల్ 15 వేల మెగావాట్లకు పైగా ఆల్‌టైమ్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని స్థాపించడంతో పాటుగా 2015-16లో 43,727 కోట్ల విలువైన కొత్త ఆర్డర్లను సంపాదించుకున్న నేపథ్యంలో ఆ కంపెనీ షేరు దాదాపు 5 శాతం పెరిగింది. నిన్నటి ముగింపుకన్నా పైస్థాయిలో 24,998.79 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెనె్సక్స్ ఆ తర్వాత 25,013-24,647 పాయింట్ల మధ్య కదలాడుతూ చివరికి 215 పాయింట్ల నష్టంతో 24,685.42 పాయింట్ల వద్ద ముగిసింది. మార్చి 17 తర్వాత సెనె్సక్స్ ఇంత బలహీనంగా ముగియడం ఇదే తొలిసారి. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ సైతం 67.90 పాయింట్లు నష్టపోయి 7,546.45 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రభుత్వ రంగ సంస్థ ఐఓసి నాగార్జున గ్రూపు కడలూరు రిఫైనరీలో వాటాలు కొనుగోలు చేయాలనుకుంటుండడంతో నాగార్జున రిఫైనరీ షేర్ ధర ఏకంగా 20 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో ఆసియా మార్కెట్లు మిశ్రమ ధోరణిలో ముగియగా, ఐరోపా మార్కెట్లు కూడా అదే ధోరణిలో మొదలైనాయి. కాగా, సెనె్సక్స్‌లోని 30 కంపెనీల షేర్లలో 18 షేర్లు నష్టపోగా, మిగతా 12 లాభాలతో ముగిశాయి.