బిజినెస్

విశాఖ రైల్వేజోన్‌పై గంపెడాశలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 20: విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ అంశం మళ్ళీ తెరమీదకు వచ్చింది. చాలాకాలం స్తబ్దుగా ఉన్న ఈ అంశంపైనే ఇపుడు అందరి దృష్టిపడింది. ఇటు రైల్వేవర్గాలు, మరోపక్క ఉత్తరాంధ్ర ప్రజానీకం దీని గురించే చర్చించుకుంటున్నారు. 2017 ఫిబ్రవరిలో రైల్వేబడ్జెట్‌లోనైనా దీనిపై అధికారిక ప్రకటన చేయవచ్చని ఇటు ప్రయాణికులు, రైల్వేవర్గాలు విశ్వసిస్తున్నాయి. ఉత్తరాంధ్ర ప్రజానీకం అయితే దీనిపైనే గంపెడాశలు పెట్టుకున్నాయి. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, పరోక్షంగా వ్యాపారస్తులు, దినసరి వేతన కార్మికులకు ఉద్యోగాలు లభిస్తాయనేది వీరి ఆలోచన. స్థానిక నినాదంతో అర్హులైన నిరుద్యోగులకు కనీసం ఐదు వేల మందికైనా జోన్ పరిధిలో ఉద్యోగాలు లభిస్తాయి.
రైల్వేలో ఉన్న 12 క్యాటగిరీల్లో పరోక్షంగా ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలోను కనీస వేతనాలపై ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే రైల్వే ఉద్యోగుల పిల్లలు, రిటైర్ అయిన వారి పిల్లలకు ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగుపడతాయి. ఆపరేటింగ్, ఇంజనీరింగ్, మెకానిక్, కమర్షియల్, సేఫ్టీ, కనస్ట్రక్షన్, రన్నింగ్, టెలికామ్ అండ్ సిగ్నలింగ్, పరిపాలన, మెడికల్ విభాగాల్లో కొత్త పోస్టులు వస్తాయి. ఈ విభాగాల్లో కనీసం ఐదు వేల పోస్టులు ప్రత్యక్షంగా భర్తీ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది ఏర్పడిన ఖాళీలు గత కొనే్నళ్ళుగా నింపడంలేదు.
జోన్ వస్తే వీటి భర్తీకి మోక్షం లభిస్తుంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బి)ని స్థాపిస్తారు. దీనివల్ల స్థానికులకు ఇక్కడే రైల్వే పరీక్షలు రాసేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి తరలిపోయిన చీఫ్ ఇంజనీరింగ్ కార్యాలయం మళ్ళీ ఇక్కడకే వస్తుంది. దీనివల్ల కోట్లాది రూపాయలు విలువైన రైల్వే ప్రాజెక్టులు మంజూరవుతాయి. అన్నింటి కంటే ప్రధానంగా జోన్ స్థాయిలో దేశ నలుమూలలకు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళే సూపర్‌పాస్ట్‌లు, ఎక్స్‌ప్రెస్‌ల సంఖ్య పెరుగుతుంది. ఇవి కాకుండా అవసరమైన సుదూర ప్రాంతాలకు కోరుకున్న రైళ్ళను నిర్వహించుకునే వీలుంటుంది. అపుడు భారతీయరైల్వేలో ఉన్న 16 రైల్వేజోన్ల కంటే విశాఖ కేంద్రంగా ఏర్పడే రైల్వేజోన్‌కు ప్రాముఖ్యత పెరుగుతుంది.
విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేసే అంశంపై గత కొంతకాలంగా నెలకొన్న సాంకేతికపరమైన సమస్యలన్నింటినీ కేంద్రం పరిష్కరించగలుగుతుంది. దేశంలోనే మరెక్కడా లేనివిధంగా సొంత భూములు కలిగి ఉన్న రైల్వే ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్థలాలను కొనుగోలు చేయాల్సిన ఇబ్బందులు తప్పుతున్నాయి. విశాఖ నగరంలో మర్రిపాలెం మార్షలింగ్‌యార్డు, కంచరపాలెం, జ్ఞానాపురం, గోపాలపట్నం, దువ్వాడ, సింహాచలం నార్త్‌కేబిన్, నగర సమీపంలో కొమ్మాది ప్రాంతాల్లో రైల్వే భూములున్నాయి. వీటిలో కొన్ని ఆక్రమణలకు గురికాగా, మరికొన్నిచోట్ల రైల్వే అధికారులు, ఉద్యోగుల నివాసితకాలనీలుగా అభివృద్ధి చెందుతున్నాయి.
ఇంకొన్నింటినీ రైల్వేలో ఆయా విభాగాల కోసం కేటాయించారు. మిగిలిన కొన్నిచోట్ల ఖాళీగా పడి ఉండే వాటిని గుర్తించి వీటిని జోన్ జనరల్ మేనేజర్ కార్యాలయానికి, పరిపాలనా విభాగం, ఉన్నతాధికారుల క్వార్టర్ల కోసం ఉపయోగించాల్సి ఉంది. ఇపుడు దీనిపైనే ఉన్నతాధికారులు దృష్టిపెడుతున్నారు.
ఈ విధంగా రైల్వేకు భూ సమస్య తప్పినట్టే. రైల్వేజోన్‌ను ఇక్కడ కాకుండా మరే ప్రాంతంలో ఇచ్చినా ఖచ్చితంగా స్థల సమస్య తలెత్తనుంది. ఇకపోతే ఉద్యోగులను కొన్నాళ్ళపాటు సర్దుబాటు పద్ధతిలో సేవల కోసం ఉపయోగించుకోవచ్చు. ప్లాట్‌ఫారాలను కొత్తగా నిర్మించాల్సిన అవసరం రాదు. ఎందుకంటే ఈస్ట్‌కోస్ట్‌రైల్వే జోన్ హెడ్‌క్వార్టర్‌గా నడుస్తున్న భువనేశ్వర్ తక్కువ ప్లాట్‌ఫారాలతోనే నడుస్తోంది. అటువంటిది ఒక్క విశాఖరైల్వేస్టేషన్‌లోనే ఎనిమిది ప్లాట్‌ఫారాలున్నాయి. రైళ్ళు 130కి పైగానే నడుస్తున్నాయి.
ఫుట్‌ఓవర్‌బ్రిడ్జిలు, అన్ని తరగతులకు చెందిన విశ్రాంతి గదులు, నిరంతరం నిఘా పెట్టే సిసి కెమెరాలు, ప్రయాణికులకు సులభంగా రాకపోకలు సాగించేందుకు వీలుగా వౌలిక వసతులు మెరుగుపడుతున్నాయి. అన్నింటి కంటే ప్రధానంగా ఒడిశా పెత్తనం ఇక నుంచి వాల్తేరు డివిజన్‌పై ఉండదు.
రైల్వేజోన్ వస్తే ఏ విధంగాను వివక్షతకు గురయ్యే పరిస్థితులుండవు. పాత కోచ్‌లను కేటాయించి, విశాఖకు వచ్చిన కొత్త రైళ్ళన్నీంటిని భువనేశ్వర్‌కు తరలించడం, ఇక్కడ నుంచి తరలించుకున్న చీఫ్ ఇంజనీరింగ్ కార్యాలయం వంటి సంఘటనలకు జోన్ ద్వారా చెక్ పెట్టినట్టు అవుతుంది.